India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో రోడ్ల ఆధునికీకరణకు ప్రభుత్వం ₹1,227.13 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా ‘హ్యామ్’ (HAM) విధానంలో ఐదు నియోజకవర్గాల్లో 426 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో కాంట్రాక్టరే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉండటంతో పనుల్లో నాణ్యత పెరగనుంది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై డీఈవో చర్యలు తీసుకున్నారు. శనివారం వేంసూర్ మండలం అడసర్లపాడు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో.. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో వేసవిలో అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. ఇందుకోసం 296 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 10 సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఇంటర్‌లింకింగ్ వ్యవస్థను సిద్ధం చేశామని, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం RTC బస్సు,కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రయాణికులకు జరిగిన గాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ACP సారంగపాణి, CI వెంకటప్రసాద్, SI పవన్ పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్‌కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.

తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా గృహాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో మంజూరైన 802 ఇళ్లలో ప్రస్తుతం 736 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.

తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా గృహాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో మంజూరైన 802 ఇళ్లలో ప్రస్తుతం 736 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో యాసంగి పెసర రైతులకు మద్దతు ధర దక్కక కన్నీరు మిగులుతోంది. ప్రభుత్వం క్వింటాకు ₹8,882 ధర నిర్ణయించినా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి ₹7,000 లోపే చెల్లిస్తున్నారు. నాణ్యత సాకుతో మరికొంత ధర తగ్గిస్తుండటంతో రైతులు క్వింటాకు ₹1,800 పైగా నష్టపోతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పెసర రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వైరా: ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా, పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల చేర్పులపై నియోజకవర్గ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరమని ఆమె స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.