India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం సూచనల మేరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో నేడు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నమోదైన వర్షాపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మధిరలో 66.5 మి.మీ, వేంసూరు 59.2, కూసుమంచి 52.3, బోనకల్ 49.5, ఎర్రుపాలెం 40.7, ముదిగొండ 38.6 మి.మీ. వర్షం పడింది. తక్కువగా సింగరేణిలో 3.4, తల్లాడలో 3.2 మి.మీ. నమోదైంది. మొత్తం 21 మండలాల్లో 575 మి.మీ నమోదైందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం ముదిగొండ, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం నగరం, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. వినాయక చవితి పండుగకు సంబంధించి ఏర్పాట్లు, నిమజ్జనంపై బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తిరుమలాయపాలెం మండలం, రాకాసి తండాను సందర్శించారు. సమీపంలోని ఆకేరు వాగు వరద ప్రాంతాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి, ఆకేరు వరద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా జరిపారు.
ఖమ్మం జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టాలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం ఆందిచాలని పేర్కొన్నారు.
పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనుబల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గంగదేవిపాడుకి చెందిన దంతనపల్లి నాగరాజు(24) ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు తన తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణ స్థాయిలను పాటించేటటువంటి 22000 ఆహార భద్రత నిర్వహణ స్థాయి పాటించే గుర్తింపు లభించింది. మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అందుకున్నారు. ఈ సర్టిఫికెట్ను ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించారు.
గత సం. ఖమ్మంలో ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం కార్పొరేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి 24×7 మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని చెప్పారు. అటు విద్యా సంస్థలతో చర్చించి సంబంధిత శాఖ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.