India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మంలో చోరీలకు పాల్పడుతున్నాడంటూ ఓ వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అతని వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వన్ టౌన్ సీఐ 87126 59106, ఖమ్మం టౌన్ ఏసీపీ 87126 59105 నంబర్లకు కాల్ లేదా మెసేజ్ చేసి వివరాలు తెలియజేయాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండాలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడే పొలంలో పనిచేస్తున్న తల్లీకూతుర్లకు గాయాలయ్యాయి. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గ్రామస్థులు వెంటనే వారిని 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
> వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం > కొత్తగూడెంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన > ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు > ముదిగొండలో విద్యుత్ సరఫరా లో అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు > వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన > పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు అనంతరం సోమవారం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.
ఖమ్మం జిల్లాలో గ్రూప్స్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ డా.మహేందర్ రెడ్డి, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?
కులగణన తర్వాత స్థానిక ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీల నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీపరంగా సానుభూతిపరులు ఎవరు? తమకు ఎవరు మద్దతిస్తారు..? తటస్థులు ఎంత మంది? అని విచారిస్తున్నారు. కుల సంఘాలను సంప్రదించడం ద్వారా ఎన్ని ఓట్లను రాబట్టుకోగలం..? అన్న లెక్కల్లో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,070 జీపీలు ఉన్నాయి.
గురుకులాలకు సొంతభవనాలు ప్రభుత్వమే నిర్మించాలని, సరుకులు సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల గురుకుల భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లకు తాళాలు వేసి మూసి వేశారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టమని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవనాలను తెరిపించి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.