India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నేడు ఉదయం 8.30 వరకు జిల్లాలో మొత్తం 430.8 MM వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. ఎక్కువగా బోనకల్ 58.6 MM వర్షపాతం నమోదు కాగా చింతకాని 49.4, కల్లూరు 38.4, కొణిజర్ల 33.4, పెనుబల్లి 32.2, కూసుమంచి 31.8 MM వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పలు విభాగాల్లో పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో 259 మంది కార్మికులు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో సగం మందే పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్ట్ గడువు ఈ నెలతో ముగుస్తున్నందున 50 మందికి ఒక సూపర్వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగించి పనులు చేయించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ, టేకులపల్లి)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీటెక్ బయో మెడికల్ అర్హత కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో గడచిన 24 గంటల్లో మొత్తం 418.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. వేంసూర్ మండలంలో అత్యధికంగా 74.4 మి.మీ, ఎర్రుపాలెం 52.2, నేలకొండపల్లి 50.2, బోనకల్ 47.8, మధిర 42.2 వర్షాపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో తక్కువ వర్షపాతం రికార్డు కాగా జిల్లాలో సగటు వర్షపాతం 19.9 మి.మీగా నమోదైందని, రెండు రోజులు పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.
ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావి, నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని సందర్శించి, పర్యాటక అభివృద్ధి పనులను సమీక్షించారు. రూ.29 కోట్లతో ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని, మ్యూజియం, పార్క్, బోటింగ్, రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.
కూసుమంచి మండలం పాలేరు సాగర్ ఎడమ కాలువ వద్ద రూ.14 కోట్లతో నిర్మిస్తోన్న యూటీ(అండర్ టన్నెల్) పనులను గురువారం ఇరిగేషన్ శాఖ సీఈ, ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను గుత్తేదారు గోపాలరావు మూడు షిప్టుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేశారని, మిగిలిన చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
జల్ జీవన్ మిషన్ పనులపై కేంద్ర అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తెలంగాణ, ఝార్ఖండ్, అరుణాచల్ కలెక్టర్లతో వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. మిషన్ పనులను పర్యవేక్షించేందుకు డాష్ బోర్డు ఏర్పాటు చేసినట్లు కమల్ కిషోర్ తెలిపారు. ప్రతి జిల్లా పరిధిలోని పనులను పర్యవేక్షించాలని, దిశ సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించి, ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు.
ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.
ఎర్రుపాలెం మండలం భీమవరం-కాచవరం, అయ్యవారిగూడెం-బుచ్చిరెడ్డిపాలెం రహదారుల నిర్మాణానికి అనుమతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు గురువారం జాయింట్ సర్వే చేపట్టారు. ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూములపై రహదారుల నిర్మాణానికి అనుమతి అవసరం ఉండడంతో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ మహేశ్, ఎఫ్డీఓ వెంకన్న, ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, జేఈ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.