India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎర్రుపాలెం మండలం భీమవరం-కాచవరం, అయ్యవారిగూడెం-బుచ్చిరెడ్డిపాలెం రహదారుల నిర్మాణానికి అనుమతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు గురువారం జాయింట్ సర్వే చేపట్టారు. ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూములపై రహదారుల నిర్మాణానికి అనుమతి అవసరం ఉండడంతో డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ మహేశ్, ఎఫ్డీఓ వెంకన్న, ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, జేఈ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
చింతకాని మండలం చిన్నమండంలో నానో యూరియాపై మధిర వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయచంద్ర రైతులకు అవగాహన కల్పించారు. సంప్రదాయ యూరియాతో నత్రజని వినియోగ సామర్థ్యం 30-40% మాత్రమేనని, నానో యూరియాతో అది 80-85% ఉండి మొక్కలకు తక్కువ మోతాదులో సరిపోతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇది సహాయకమని, ఖర్చు తగ్గుతుందని, పురుగు మందు కలిపి కూడా పిచికారీకి వీలుంటుందని తెలిపారు. మానస, కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 3, 4న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 45 పతకాలు సాధించారు. వీరిలో 23 బంగారు, 11 రజత, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం విజేతలను అభినందించారు. కోచ్ ఎండి గౌస్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, ఒలింపిక్స్‌లో కూడా పాల్గొని జిల్లా పేరు నిలబెట్టాలన్నారు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ పేరెల్లి ప్రవీణ్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్‌పై 12 నెలల పాటు పీడీ యాక్ట్ కొనసాగిస్తున్నట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నిందితులు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ వంటి వరుస నేరాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఖానాపురం సీఐ భానుప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి రాజసాయి మందిరంలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లాలో చేనేత దినోత్సవ వేడుకలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం నగరంలో BRTU సంఘీభావ ర్యాలీ
∆} ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంప్
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు.
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తీర్పునిచ్చారు. సీఐ సాగర్ వివరాలిలా.. వైరా (M) గొల్లనపాడులో 2024లో లాలయ్య(70) ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచాగా పై విధంగా తీర్పు వచ్చింది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో టెస్కో స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విక్రయాల్లో అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం, రాజ్కోట్ ఇక్కత్ సిల్క్ చీరలపై 40 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని తెలిపారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
యువతకు ATC కోర్సులతో ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను అప్ గ్రేడ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల నిర్మిత కేంద్రాలను తిరిగి ప్రారంభించింది. వీటి ద్వారా ఫ్లైయాష్ బ్రిక్స్‌ను సరసమైన ధరకే అందించనుంది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం కాకుండా తోడ్పాటు నందించనుంది. కాగా ఇప్పటికే చింతకానిలో విఘ్నేశ్వర ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్ కేంద్రం ప్రారంభమైంది.
Sorry, no posts matched your criteria.