India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన రెండు రోజుల్లోనే 155 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రేషన్ పంపిణీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అన్నా సహాయత’ పేరుతో ఫిర్యాదులను స్వీకరిస్తోందని DSO చందన్ కుమార్ తెలిపారు. రేషన్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఈప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాట్సాప్ నంబర్ 98682 00445, IVR నంబర్ 14457కు కాల్ చేసి వాయిస్ ద్వారా ఫిర్యాదులను తెలియజేయొచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఖమ్మం జిల్లాలో పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు 20 ZPTC, 283 MPTC స్థానాల వారీగా తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లతో పాటు 1,580 పోలింగ్ స్టేషన్లను ప్రకటించారు. జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. ఇక ఎన్నికల తేదీలే ప్రకటించాల్సి ఉంది.

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. D/B పార్మసీ, ఎస్ఎస్సీ ఆపైన విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారితనంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. బుధవారం ఖమ్మం TTDC మీటింగ్ హాల్‌లో మధిర నియోజకవర్గంలో చేపట్టనున్న పైలెట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహణపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సానుకూలంగా ఉన్న ప్రతి దరఖాస్తును పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని దరఖాస్తులకు కారణాలు తెలియజేస్తూ లేఖ రాయాలని సూచించారు.

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రామ పరిపాలన అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో 252 మందికి పోస్టింగ్‌లు కల్పిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం అమలు, భూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన లేఅవుట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు, సీవరేజ్, వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నీటి వనరుల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వరాదని, అధికారులు పారదర్శకతతో పాటు పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు.

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. భేటీలో తమ అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించాలనే అంశాలపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం అర్బన్ పరిధిలోని బల్లెపల్లిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. సుమారు 21 ఎకరాల భూమిలో 3000 మంది విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక(మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30 రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.