India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్ కేసులను పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని ఆయన ప్రజలను కోరారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక (మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఖమ్మం నగరం సుందరీకరణ, ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పనులు చాలా వరకు సగంలోనే మిగిలిపోయాయి. రిక్కాబజార్, చెరువు బజార్, రైల్వే స్టేషన్ రోడ్డు, PSR రోడ్డు, RTA కార్యాలయ రోడ్ల విస్తరించేందుకు పనులను ప్రారంభించగా.. వీటిలో కొన్ని రోడ్లు వెడల్పు చేయకుండానే నిలిచిపోయాయి. ఇలాగైతే పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
∆} కూసుమంచి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు సొసైటీలో యూరియా సరఫరా
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం కఠినంగా అమలవుతోందని, నిందితులు తప్పించుకునే అవకాశం లేదని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన భరోసా కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో రాజీకి అవకాశం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడతాయని తెలిపారు.

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

గణేశ్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.

ఖమ్మం మున్నేరు నది ఒడ్డున అసంపూర్తిగా నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనం సరిగా జరగలేదని విమర్శించారు. అధికారులు స్పందించి విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.