Khammam

News August 3, 2024

ఖమ్మం: పంచాయతీ ఎన్నికల సందడి షురూ!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఐదుగురి చొప్పున మాస్టర్ ట్రైనర్లుగా ఆపరేటర్ల జాబితా తయారు చేసి పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. వీరు శిక్షణ పొందిన అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఓటరు జాబితాపై అవగాహన కల్పిస్తారు.

News August 3, 2024

అగ్రికల్చర్ మార్కెట్ నూతన పాలకవర్గం నియామకం: మంత్రి తుమ్మల

image

ఖమ్మం జిల్లాలో పలు మార్కెట్లకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆనంద్ బాబు, వైస్ ఛైర్మన్ గా వెంకటప్ప రెడ్డి నియమితులయ్యారు. అటు కల్లూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నీరజ, వైస్ ఛైర్మన్‌గా కోటేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులను నియమించినట్లు మంత్రి చెప్పారు. నూతన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News August 3, 2024

ఖమ్మం జిల్లాలో సీడీపీఓల బదిలీ

image

ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన సీడీపీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రూరల్(M)(1)లో పనిచేస్తున్న శివమ్మ అదే మండలానికి, అటు ఖమ్మం రూరల్(M) (2) జయలక్ష్మి మణుగూరుకు, ఖమ్మం అర్బన్ కవిత మధిరకు, చండ్రుగొండ(M) నిర్మల జ్యోతి కల్లూరుకు, అశ్వారావుపేట(M) సరస్వతి తిరుమలాయపాలెంకు, బూర్గంపాడు(M) సలోమి చండ్రుగొండకు, తిరుమలాయపాలెం (M) కనకదుర్గ సత్తుపల్లికి బదిలీ అయ్యారు.

News August 3, 2024

ఖమ్మంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

విద్యుత్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మంకి చెందిన గోటం నాగలక్ష్మి ఓ కోచింగ్ సెంటర్లో ఆయాగా పనిచేస్తోంది. శుక్రవారం తన వద్ద తాళం చెవిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న వారికి ఇచ్చేందుకు తాళాలు విసరగా అవి విద్యుత్ తీగలపై పడ్డాయి. వాటిని ఆమె ఇనుప రాడ్ ద్వారా తీస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. 

News August 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 27, 28న (శని, ఆదివారాలు) వారంతపు సెలవుల కారణంగా రెండు రోజులు మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. రైతులు గమనించాలని కోరారు.

News August 3, 2024

మెడికల్ కాలేజీకి భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం

image

ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెంలో 35ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అధునాతన సౌకర్యాలతో అన్ని భవన నిర్మాణాలు సత్వరమే చేపట్టి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

News August 3, 2024

రిటైర్ మెంట్ వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు: సీపీ

image

ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్  శాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలతో మన్ననలు పొందారని కొనియాడారు. రిటైర్‌మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

News August 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యఅంశాలు

image

∆}ధరణితో దగా చేశారు: మంత్రి పొంగులేటి
∆} ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రతపై సిబ్బందిపై ఫైర్ అయిన ఐటీడీఏ పీవో
∆}భద్రాచలంలో రేపు, ఎల్లుండి మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్
∆}పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే కూనంనేని
∆}సత్తుపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ ఫుటేజ్
∆}భద్రాద్రి:22 మంది బాల కార్మికులకు విముక్తి: ఎస్పీ రోహిత్

News August 2, 2024

ధరణితో దగా చేశారు: మంత్రి పొంగులేటి

image

ధరణి పోర్టల్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో అన్నారు. ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధరణి సమస్యలపై వేల అప్లికేషన్లు తమ దృష్టికి వచ్చాయని మండిపడ్డారు. ధరణి వచ్చాక ప్రతి గ్రామంలోనూ సమస్యలు ఏర్పడ్డాయని, వాటి పరిష్కారానికై రైతులు చెప్పులరిగేలా ఆఫీసర్ల చుట్టూ తిరిగారని విమర్శించారు.

News August 2, 2024

KTDM – SEC రైలు ప్రారంభం 

image

ఈ నెల 18 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 18న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి భద్రాచలం రోడ్డుకు ఉదయం 3.30 గంటలకు చేరుకోనుందన్నారు. పాత ప్యాసింజర్ స్థానంలో ఈ ఎక్స్‌ప్రెస్ నడుస్తుందని వెల్లడించారు.