Khammam

News August 2, 2024

KMM: ఇదే చివరి అవకాశం

image

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్‌కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని SR&BJNR ప్రిన్సిపల్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈనెల 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.

News August 2, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు. కాగా నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు తెలిపారు.

News August 2, 2024

సాయంత్రం సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 2, 2024

‘డయాలసిస్ పడకలు అందుబాటులోకి తీసుకురావాలి’

image

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూత్రపిండ వ్యాధిగ్రస్థుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు తయారైంది. వేలాది మంది డయాలసిస్ బాధితులు ఉంటే.. ప్రభుత్వా ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో మాత్రమే పడకలు దర్శనమిస్తున్నాయి. రక్తం శుద్ధి చేసుకునేందుకు రోగులు నిరీక్షిస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో మరిన్ని డయాలసిస్ పడకలు అందుబాటులోకి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు.

News August 2, 2024

శిక్షణను సద్వినియోగం చేసుకోండి: జిల్లా కలెక్టర్

image

విద్యార్థులు శిక్షణను సద్వినియోగం
చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. నగరంలోని ఐటీ హబ్‌ను సందర్శించిన ఆయన కంపెనీల కార్యకలాపాలపై ఆరా తీశారు. అనంతరం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, లెర్నెట్ స్కిల్స్ జనరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫుడ్ అండ్ బేవరేజ్(స్టీవార్డ్) నైపుణ్య శిక్షణ వివరాలు తెలుసుకున్నారు.

News August 2, 2024

అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల విద్యాలయం నిర్మాణం

image

రఘునాథఫాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టెండర్లను పూర్తి చేసి త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు.

News August 2, 2024

సైబర్ బాధితులు గంటల వ్యవధిలోనే ఫిర్యాదు చేయాలి: సీపీ

image

ఖమ్మం: సైబర్ నేరాల ద్వారా సొమ్ము పోగొట్టుకున్న బాధితులు (గోల్డెన్ అవర్‌) గంట వ్యవధిలో 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయడం ద్వారా దొంగిలించిన మొత్తాన్ని స్తంభింపజేసే అవకాశాలను గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు.

News August 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రోజు ముఖ్యాంశాలు

image

* సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలు
*గంజాయి అమ్మే వారికి ఖమ్మం జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
*సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
*భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్
*సుప్రీంకోర్టు తీర్పుతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు
*ఖమ్మం నగరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 1, 2024

సత్తుపల్లి రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

సత్తుపల్లి మండలం గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామగోవిందాపురానికి చెందిన బేతి సురేశ్(25), ముత్తిన వేణు (18), కరీముల్లా (12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.