Khammam

News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 1, 2024

సత్తుపల్లి రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

సత్తుపల్లి మండలం గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామగోవిందాపురానికి చెందిన బేతి సురేశ్(25), ముత్తిన వేణు (18), కరీముల్లా (12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 1, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

image

సత్తుపల్లి మండలం గంగారం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 1, 2024

గోదావరిలో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని మృతదేహం

image

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి సమీపంలోని గోదావరిలో గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.

News August 1, 2024

అనారోగ్యంతో బయ్యారం ఎంపీడీవో మృతి

image

అనారోగ్యంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి మృతి చెందిన ఘటన గురువారం బయ్యారం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బెక్కంటి శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎంపీడీవో మృతి పట్ల పలువురు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.

News August 1, 2024

ఖమ్మం: రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

కారేపల్లి మండలం రావుజితండా గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు మూలమలుపు వద్ద, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. లేకుంటే బోల్తా పడి ఉండేదని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 1, 2024

సూర్యాపేట హైవే వద్ద వంతెన మంజూరు

image

ఖమ్మం-సూర్యాపేట హైవే ఎంట్రీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం మంజూరైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద సూర్యపేట వైపు కొద్ది దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో సంభవిస్తున్న ప్రమాదాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ద్వారా తెలియజేయగా బ్లాక్ స్పాట్‌గా గుర్తించి ఫ్లైఓవర్ మంజూరుకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.

News August 1, 2024

సాగర్ జలాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ చర్చ

image

సాగర్ జలాలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు.  ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకే కాక తాగు నీటి అవసరాల కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని ఉత్తమ్‌ను మంత్రి తుమ్మల కోరారు. ఈనెల 2న శుక్రవారం నీటి విడుదలకు అంగీకరించిన మంత్రి ఉత్తమ్ నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News August 1, 2024

పాస్ బుక్ లేకున్నా రుణమాఫీ: మంత్రి తుమ్మల

image

పట్టాదారు పాస్ బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాంటి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ.25వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. పంట వేసిన వారికే రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

News July 31, 2024

BREAKING: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యయత్నం

image

ఇంటర్మీడియట్ విద్యార్థినీ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన భద్రాచలంలో జరిగింది. భద్రాచలం చర్ల రోడ్డులోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తోటి విద్యార్థులు తెలిపారు. కళాశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.