India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

CM రేవంత్ రెడ్డిని తన పెళ్లికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు యువజన కాంగ్రెస్ నేత భూక్య గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. కారేపల్లి మండలం మేకలతండాకి చెందిన గణేష్ తనకు పెళ్లి కుదిరిందని సీఎం వచ్చిన రోజే తాను పెళ్లి తేదీ ఖరారు చేస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సీఎంకు రావాలని రిక్వెస్ట్ లెటర్ పంపారు. ఈ లెటర్ జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.

ఖమ్మం: నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క అన్నారు. శనివారం మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 1317 మంది రైతుల నుండి రూ.24.66 కోట్ల విలువ గల 10628.760 మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించినట్లు అదనపు కలెక్టర్ మంత్రులకు వివరించారు.

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే ప్రవేశ పరీక్షల కొరకు విద్యార్థులు ఈ నెల 21 నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని DEO సోమశేఖరశర్మ తెలిపారు. ఈనెల 27న 6వ తరగతి విద్యార్థులకు ఉ.10 గంటల నుంచి మ.12.00 గంటల వరకు, 7వ, 10వ తరగతి విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పదో తరగతి విద్యార్థులు 655మంది, ఇంటర్ అభ్యర్థులు 898మంది ఉన్నారు. నేటి నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనున్నాయి.

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఖమ్మం కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. సంపత్-62, బాలాజీ-119, త్రిపుర-288, మణిచంద్రసాయి-572, నాగరాజు-1082, వెంకట సాయి కృష్ణ -1499తో పాటు మరెంతో మంది జాతీయ స్థాయిలో సత్తా చాటారన్నారు. డైరక్టర్స్ జగదీష్, కోటేశ్వర్ రావు, వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రామచంద్రయ్య, డీన్ వంశీకృష్ణ, AO నిరంజన్ కుమార్ విద్యార్థులను అభినందించారు.

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. 100లోపు, 1000లోపు ఆల్ ఇండియా ర్యాంకులను సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఛైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య అభినందించారు.
Sorry, no posts matched your criteria.