Khammam

News April 19, 2025

ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

image

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.

News April 19, 2025

జేఈఈ మైన్స్ ఫలితాల్లో హార్వెస్ట్ ప్రభంజనం

image

JEE మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం హార్వెస్ట్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించడమే కాకుండా జిల్లా ప్రథమ, తృతీయ స్థానాలు సాధించింది. హార్వెస్ట్ కళాశాల నుంచి 40% విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించడం మరో విశేషం. అటు ఈ కళాశాల విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో సీటు పొందారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News April 19, 2025

ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

image

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మంజిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతుంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినవస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం కూడా లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?

News April 19, 2025

ఖమ్మం: రేపటి నుంచి పదో తరగతి ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ 2025 థియరీ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 26 వరకు నిర్వహిస్తున్నట్లు డిఇఓ సోమశేఖర శర్మ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో 1553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.

News April 19, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓:రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ✓: కూసుమంచిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ✓: తల్లాడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ✓:ఏన్కూర్: వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ✓:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓: కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓: పలు శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ✓: ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 19, 2025

NKP: భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

image

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.

News April 19, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను సహించం: మంత్రి పొంగులేటి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బేస్మెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News April 19, 2025

ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

image

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 19, 2025

ధరణితోనే కాంగ్రెస్‌కు అధికారం: మంత్రి పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని, తొలగించి భూ భారతిని తీసుకొచ్చామని పేర్కొన్నారు.