Khammam

News July 29, 2024

పాల్వంచ కేటీపీఎస్‌లో పట్టాలు తప్పిన రైలు

image

పాల్వంచ కేటీపీఎస్‌లోని ఏడో దశలో కోల్ వ్యాగన్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం కోల్ యార్డులో బొగ్గును అన్లోడ్ చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో రైలు పట్టాలు తప్పింది. KTPS అధికారులు , రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిని తిరిగి పట్టాలపై ఎక్కించారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

News July 29, 2024

KMM: ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

image

ప్రేమ పేరుతో నగదు, నగలు తీసుకొని మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి HYD అమీర్‌పేట్‌లో ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో తన సహ ఉద్యోగి ఆమెను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నగదు, నగలు తీసుకొని పెళ్లికి నో చెప్పడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదైంది. 

News July 29, 2024

మణుగూరులో దంపతుల ఆత్మహత్య

image

కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. కన్నబిడ్డలకు భారం కావొద్దని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. రామచంద్రయ్య (75), సరోజినమ్మ(69) మణుగూరు మండల పరిధిలోని పగిడేరు పంచాయతీ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారు బిడ్డలకు భారం కావొద్దని భావించారు. సూసైడ్ చేసుకున్నారు.

News July 29, 2024

ఖమ్మం: పనిచేస్తూ పొలంలో ప్రాణాలు విడిచాడు

image

వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లి ఓ వ్యక్తి మూర్చతో పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడుకి చెందిన సైదులు (42) ఆదివారం గ్రామంలోని ఓ రైతు వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లాడు. సైదులుకు మూర్చ రావడంతో బురదలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 29, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయండి: మంత్రి

image

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమస్యలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం ఉండేలా చూడాలన్నారు. అటు అవసరమున్న చోట ఖబరస్థాన్, షాదిఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News July 28, 2024

జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సం.లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ పిఓ రాహుల్ తెలిపారు. MPC, BPC, CEC, HEC, MEC & Vocation గ్రూపులలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31న ఉ.10 గంటలకు గిరిజన గురుకుల కళాశాల(బాలికలు) భద్రాచలం నందు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News July 28, 2024

తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: పొంగులేటి

image

తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆదివారం కూసుమంచి పర్యటనలో మంత్రి వ్యాఖ్యానించారు. పల్లెల్లో మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. పారిశుధ్ధ్య సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామన్నారు.

News July 28, 2024

ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల జోష్

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూCMరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC,ZPTCల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

News July 28, 2024

ఖమ్మం: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్

image

ఫిట్స్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం తిరుమలాయపాలెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చోడుకు చెందిన కుమ్మరికుంట్ల సైదులు(36) పొలాన్ని దున్నేందుకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యపిల్లలు ఉన్నారు. సైదులు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 28, 2024

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో కలియ తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల మర్యాదతో మెలిగి మంచి చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.