Khammam

News July 28, 2024

పాల్వంచలో బెట్టింగ్ వల్ల యువకుడి సూసైడ్

image

పాల్వంచ మండలం జగన్నాథపురం సమీపంలో నిన్న ఓ యువకుడు ప్రవీణ్(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్‌లో రూ.70 వేలు పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక, భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 28, 2024

భద్రాద్రికి వరదొస్తే దినదిన గండమేనా

image

భద్రాచలం వద్ద ఉన్న గోదావరి ఉప్పొంగిన ప్రతీ ఏడాది ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. గోదావరి వరదతో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉందా అంటే అవునని సమాధానం వస్తోంది. మరి ఎందుకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. వరద తీవ్రమైతే భద్రాచలం పరిస్థితి ఏంటి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంటే ఎందుకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

News July 28, 2024

KTDM: భూత వైద్యుడిపై కేసు నమోదు

image

భూత వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న దమ్మపేటకు చెందిన రేపల్లె తిరుపతిపై ఎస్సై గణేశ్ శనివారం బైండోవర్ కేసు నమోదు చేశారు. నిందితుడు దుమ్ముగూడెం మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దెయ్యం పట్టిందని వదిలిస్తానని నమ్మించి వేలాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 28, 2024

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను BRS సరిగా ఖర్చు చేయలేదు: డిప్యూటీ సీఎం

image

BRS ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సరిగా ఖర్చు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ సబ్ ప్లాన్ రూ.33,124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ రూ.17,056 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.10,028 కోట్లు, మైనార్టీల సబ్ ప్లాన్‌కు రూ.3,002 కోట్లు కేటాయించామని తెలిపారు.

News July 28, 2024

BRS ప్రభుత్వం 2 నెలలు పింఛన్లు ఎగ్గొట్టింది: డిప్యూటీ సీఎం భట్టి

image

BRS ప్రభుత్వం 2 నెలలు ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ORRపై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని భవిష్యత్లో ఆదాయం లేకుండా చేశారు. పదేళ్లుగా టీచర్లకు పదోన్నతులు, బదిలీలు లేవు. ఈ ప్రభుత్వం 16 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించింది’ అని అన్నారు.

News July 28, 2024

ఖమ్మం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయురాలి సస్పెండ్

image

కల్లూరు మండలం పేరువంచ హైస్కూల్లో ఉపాధ్యాయురాలు శిరీష విద్యార్థుల జుట్టును కత్తిరించిన విషయంపై Way2News వార్తను ప్రచురించింది. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు విద్యార్థుల జుట్టును కత్తిరించడం ఏంటని పలువురు ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 28, 2024

సీతారామ ప్రాజెక్టు కెనాల్ నిర్మాణ పురోగతిని పరిశీలించిన మంత్రి

image

ఏన్కూరు మండలం ఇమామ్‌నగర్ వద్ద శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించాలని ఆదేశించారు. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నాటికి పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు.

News July 27, 2024

కొత్తగూడెం: తల్లిని చంపి కొడుకు సూసైడ్ 

image

కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తల్లిని హత్య చేసి కొడుకు సూసైడ్ చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. పాసి (55), కొడుకు రవికుమార్ బూడిదగడ్డలో ఉంటున్నారు. రవికుమార్ తల్లి పాసిని రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. 

News July 27, 2024

52 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు దగ్గరగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలోని నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

News July 27, 2024

ఖమ్మం: త్వరలో సర్పంచ్ ఎన్నికలు.. ఆశావహుల్లో సందడి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. పాత రిజర్వేషన్లు మార్చొద్దని చెప్పడంతో, కొత్తగా ఎలా చేర్చుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,054 గ్రామ పంచాయతీలున్నాయి.