Khammam

News March 20, 2025

ఖమ్మం: మహా ప్రస్థానం.. మహాద్భుతంగా ఉండాలి: తుమ్మల

image

మనిషి మృతి చెందిన తర్వాత చివరి మజిలీ మహా “ప్రస్థానం” మహా అద్భుతంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల ఆదేశించారు. బుధవారం హైదరాబాదులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం, సత్తుపల్లిలో మోడల్ వైకుంఠ దామాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అగస్త్య, సత్తుపల్లి కమిషనర్ నరసింహ ఆదేశించారు.

News March 20, 2025

ఖమ్మం: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

మంచి మనస్సుతో అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేసి బాలల సదనం సుందరీకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, నగరంలోని బాల సదనం భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాలు, గ్రీనరీ, వాల్ పెయింట్, అదనపు వసతుల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

News March 20, 2025

ఖమ్మం: పదో తరగతి పరీక్షలకు వేళాయే!

image

ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాల్లో 16,788 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ శర్మ చెప్పారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.

News March 20, 2025

SSC పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: CP

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. 97 పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, ధర్నాలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.

News March 19, 2025

KMM: ప్రజాస్వామ్య స్పూర్తి సంరక్షణలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

ప్రజాస్వామ్య స్ఫూర్తి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమే పార్లమెంట్ వ్యవస్థ అన్నారు.

News March 19, 2025

కల్లూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కల్లూరు మండలం లింగాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తాళ్ల శ్రీనివాసరావు (అడిషనల్ డైరెక్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్) మృతి చెందారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్థులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఇటీవలే గ్రామానికి వచ్చినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన Dy.CM

image

తెలంగాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లబడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12571 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేలకోట్లు, విద్యాశాఖ రూ.23108 కోట్లు కళ్యాణ లక్ష్మీ రూ.3683, వైద్యారోగ్యశాఖకు రూ.23108 కోట్లు, గృహజ్యోతి రూ.2080 కోట్లు, రైతు బీమా రూ.1539 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.

News March 19, 2025

బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.

News March 19, 2025

మత్కేపల్లిలో రూ.1.50లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

image

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మత్కేపల్లి గ్రామానికి చెందిన బండి స్వాతి రూ.60,000, పగడాల శీను రూ.40,000, పగడాల బాబురావు రూ. 50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకాని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News March 19, 2025

నేడే బడ్జెట్.. ఖమ్మం ప్రజల గంపెడు ఆశలు..!

image

నేడు అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాలేరు ఇంజినీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్, ఖమ్మం మెడికల్ కాలేజ్, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం నుంచే ముగ్గురు మంత్రులు ఉండటంతో నిధులు దండీగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.