Khammam

News July 10, 2024

KMM: బాలికను గర్భవతిని చేసిన యువకుడు

image

బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు గర్భవతిని చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. చండ్రుగొండ మండలంలోని ఇమ్మిడిరామయ్యబంజర్‌ వాసి కంపసాటి రవి ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించానని ఎవరికైనా చెబితే వాట్సాప్‌లో పెడతానని బెదిరించాడు. బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

News July 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క రాక
> మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటన
> రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి బాధ్యతల స్వీకరణ
> అశ్వరావుపేట ఆయిల్ ఫామ్ పరిశ్రమలో క్రషింగ్ ప్రారంభం
> కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నేడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ నిరసనలు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 10, 2024

కొత్తగూడెం: సింగరేణి ఉద్యోగ దరఖాస్తులు తిరస్కరణ?

image

సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్‌లైన్ విధానంలో ఈనెల 20, 21 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎడ్సెల్ సంస్థకు అప్పగించారు. కాగా, సుమారు 21 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 4వేలకు పైగా దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ విషయం హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 10, 2024

కొత్తగూడెం: ‘సింగరేణిపై కేంద్రం కుట్రలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలి’ 

image

చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టాలను తీసుకొస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థను దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

News July 9, 2024

కొత్తగూడెం: ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం ఆమె రాష్ట్ర, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

News July 9, 2024

ఖమ్మం: ‘తమ భూమిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు’

image

తన కూతురు పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుట్ర పన్నుతున్నారని బానోతు లీలాబాయి ఆరోపించారు. మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..రఘునాథపాలెం మండలం రజ్జిబ్ అలీనగర్‌లో తనకు ఉన్న వ్యవసాయ భూమిని తన కూతురు లావణ్యకు పసుపు కుంకుమ కింద ఇచ్చానని వెల్లడించారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు స్థానిక వ్యక్తి చూస్తున్నాడన్నారు.

News July 9, 2024

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు, ఎన్ఎస్పీ లింక్ కెనాల్‌కు ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయి, ఎక్జిక్యూటివ్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తికి మిగిలిన భూ సేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇంకా భూసేకరణ చేయాల్సిన రైతులతో సంధి చర్చలు జరపాలన్నారు.

News July 9, 2024

ఖమ్మం: హోంగార్డ్ ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయం

image

ఖమ్మం జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోనే హోంగార్డులకు అదేవిధంగా హోంగార్డు కుమార్తెల వివాహలు కోసం మంజురైన, ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందుకున్న వారిలో హోంగార్డు ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, ఉపేందర్, నవీన్, కోటేశ్వరరావు, కిషన్ ఉన్నారు.

News July 9, 2024

KMM: ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా!

image

ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్యోగాల పేరుతో 60 మంది అమాయక నిరుద్యోగుల నుంచి ఘరానా మోసగాళ్లు రూ.4,08,00,000 వసూలు చేశారని మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 13 మంది నిందితులను గుర్తించగా పది మందిని అరెస్ట్ చేశామన్నారు. రూ.కోటి 47 లక్షల 14 వేలు, 4 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News July 9, 2024

KMM: రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం: మాజీ MLA

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు చూసి బాధగా ఉందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. పొద్దుటూరులో ఒక రైతు, భద్రాద్రి జిల్లా జానకిపురంలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దని, రైతాంగానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు.