India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఎస్పీ జానకి హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలను దాటవద్దని, ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వైపు వెళ్లవద్దని సూచించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జడ్చర్ల 23.3, నవాబుపేట 20.8, కౌకుంట్ల 20.3, మహమ్మదాబాద్, దేవరకద్ర 18.5, మహబూబ్‌నగర్ అర్బన్18.3, అడ్డాకుల 17.8, మూసాపేట మండలం జానంపేట, హన్వాడ 16.8, భూత్పూర్ 16.5, బాలానగర్ 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు (ఫ్రీ ప్రైమరీ) ప్రారంభించనుంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 94 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందజేయనున్నారు. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే మొదటి విడత నిధులు మంజూరయ్యాయి.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వేడివేడిగా అందించాలని పదేపదే హెచ్చరిస్తున్న పట్టించుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టిన భోజనాన్ని అందిస్తారంటూ కలెక్టర్ విజయేంద్ర బోయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగంటలో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిగిలిపోయిన భోజనాన్ని ఇంకొకసారి విద్యార్థులకు వడ్డించినట్లయితే సహించదిలేదని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మాట్లాడి.. తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ డే వేదికలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, వేగంగా పరిష్కరించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.
సైబర్ క్రైమ్ వచ్చిన కేసులలో మొత్తం రూ.1.07Cr రికవరీ చేసినట్లు మహబూబ్ నగర్ క్రైమ్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. జనవరి 2025 నుంచి 31-7-2025 వరకు మొత్తం 812 సైబర్ క్రైమ్ కేసులు వచ్చాయని, వాటిలో ఫైనాన్సియల్-627, నాన్ ఫైనాన్షియల్-185 కేసులు నమోదు అయ్యాయన్నారు. బాధితులు మొత్తం-4.49కోట్లు నష్టపోయారని, సైబర్ నేరగాళ్ల నుంచి 1.07Cr రికవరీ చేసినట్లు వెల్లడించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తిరుమలగిరిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహంలో సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 55.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 37.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 22.5, జడ్చర్ల 21.0, మహమ్మదాబాద్ 16.0, మహబూబ్ నగర్ 13.5, దేవరకద్ర 12.0, చిన్న చింతకుంట 9.5, కోయిలకొండ మండలం పారుపల్లి 8.5, అడ్డాకుల 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉమెన్స్ హాస్టల్ జనరల్ వార్డెన్‌గా డాక్టర్ కే. నాగసుధ, ఉమెన్ మెస్ వార్డెన్‌గా ఆర్. లక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉపకులపతి జి.ఎన్. శ్రీనివాస్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి, చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం. కృష్ణయ్య పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.