India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, గురువారం ఎంపీటీసీ/జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 39 జడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది.

జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. గండీడ్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, భూత్‌పూర్, బాలానగర్ మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీనికోసం జిల్లాలో 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి విజయేందిర బోయి తెలిపారు. నేటి నుంచి తొలి విడత ZPTC, MPTC ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. HYD నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

జడ్చర్ల పట్టణంలో కరెంట్ షాక్‌కు గురై గాయపడిన పాముకు చికిత్స అందించారు. పట్టణంలోని ఓ పరిశ్రమ పవర్ బోర్డులో చేరి పవర్ బోర్డులోకి చేరిన సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు గమనించిన పరిశ్రమ యజమాని సమాచారం ఇచ్చారు. ఆయన శిష్యులు శ్రీకాంత్, శివకుమార్ వచ్చి దాన్ని రక్షించారు. అనంతరం డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. తొలి విడతలో 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

MBNRలో నేరాల నివారణ, చట్టాలను కాపాడటంలో జిల్లా పోలీసు బలగాలు చూపుతున్న కృషిని జోన్–VII డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అభినందించారు. పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో ప్రజాసేవలో అగ్రగాములు కావాలని ఆకాంక్షించారు. బలగాల హాజరు రికార్డులు, ఆయుధ నిల్వలు, వాహనాల సంరక్షణ విధానాన్ని పరిశీలించి సిబ్బంది నిబద్ధతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. డీపీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీబీ, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ తదితర విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, రికార్డు నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకత వంటి అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి, అదనపు ఎస్పీలు ఎన్.బి. రత్నం, సురేష్ కుమార్ పాల్గొన్నారు.

దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని MBNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై అధికారులకు పూర్తి అవగాహన తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.

ఉదండాపూర్ భూ నిర్వాసితులకు నవంబర్ చివరి నాటికి ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పునరావాస ప్రాంతంలో 300 గజాల ప్లాటుతో పాటు ఆసుపత్రి, పాఠశాల, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.