India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని 21 స్థానాల్లో ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ-9, జనరల్-6 కేటాయించారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. బాపూజీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు.

మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రావణ్ కుమార్ గ్రూప్ -1 ఫలితాలు సీటీవోగా ఎంపికయ్యారు. పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి- జ్యోతిల కుమారుడైన శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. మార్చి నెలలో విడుదల చేసిన గ్రూప్ -1 ఫలితాల్లో 23వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు

చిన్న శంకరంపేట మండలం సంగాయిపల్లికి చెందిన లక్ష్మీనారాయణను హత్య చేసిన నేరస్తుడు ప్రవీణ్ (25)కు జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. పాత కక్షలతో లక్ష్మీనారాయణపై దాడి చేయగా తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన సూచించారు. జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన వినూత్న పథకం యాత్ర దానం ద్వారా సామాజిక సేవలో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో ఆర్టీసీ డిఎం సురేఖ, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి యాత్ర దానం కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు యాత్ర కోసం వినూత్న పథకం ప్రారంభించినట్లు తెలిపారు.

ఏడుపాయల వన దుర్గామాతను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరు ముందుగా రాజగోపురంలో వన దుర్గాభవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోకుల్ షెడ్డులో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ గౌడ్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

రాష్ట్రంలో కొత్త మద్యం షాప్‌లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కాబోతున్నది. జిల్లా కేంద్రాల్లోని రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతులకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఇందుకు అనుగుణంగా మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్ కు మార్గదర్శకాలను జారీ చేసింది.

మెదక్ జిల్లాలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. 24 గంటలో నమోదైన వర్షపాతం వివరాలు.. మెదక్‌లో అత్యధికంగా 70.5 మిమీ వర్షపాతం నమోదైంది. చిలిపి చెడ్ 57.5 మిమీ, కౌడిపల్లిలో 56.8 మిమీ, కొల్చారంలో 50 మిమీ, నర్సాపూర్‌లో 49 మిమీ, శివంపేటలో 47.5 మిమీ, వెల్దుర్తిలో 45.5 మిమీ, అల్లాదుర్గం 33.5 మిమీ వర్షం కురిసింది.

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయిన్పల్లి ప్రణయ్ సాయి గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ గ్రూప్-1 ఫలితాల్లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ పూర్తి చేశారు. గ్రూప్-4 ఫలితాల్లో సత్తా చాటి చేగుంట తహశీల్దార్ కార్యాలయంలో Jr.అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.