India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొడుకు పెళ్లి పనుల కోసం వెళ్లిన తండ్రిని ప్రమాదం రూపంలో విధి వెక్కిరించింది. దాతర్‌పల్లికి చెందిన కొలిచెలిమే ప్రశాంత్ వివాహం గంటల్లో జరగాల్సి ఉండగా.. పనుల నిమిత్తం తూప్రాన్ వెళ్లిన తండ్రిని ఇస్లాంపూర్ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కాలు విరిగి గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో, ఆసుపత్రిలో చికిత్స పొంది ధైర్యంగా వచ్చి కుమారుడి వివాహాన్ని పూర్తి చేయించారు.

విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కుగా వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసి తొలగించారు. మాసాయిపేట మండలం హకీంపేట గ్రామానికి చెందిన మల్లయ్య తూప్రాన్‌లో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యాడు. విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా పడిపోయాడు. తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ అమర్ సింగ్ తీవ్రంగా శ్రమించి గొంతులో ఇరుక్కున్న ముక్కను తొలగించారు.

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లల జీవితాల్లో పెద్దక్క లావణ్య వెలుగులు నింపింది. మెదక్ జిల్లా రామాయంపేటకి చెందిన బైరం యాదగిరి-రాజమణి దంపతులు మృతి చెందగా, చిన్న వయసులోనే ఇంటి బాధ్యతను లావణ్య భుజాన వేసుకుంది. కన్నీటిని దిగమింగి, అమ్మానాన్న లేని లోటు తెలియనీయకుండా తన ఇద్దరు చెల్లెళ్లు ప్రియాంక, పూజలను ఒక తల్లిలా సాకి ఉన్నత చదువులు చదివించింది. # నేడు సిబ్లింగ్స్ డే

ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, మత్స్య సంపద పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖకు దిశానిర్దేశం చేశారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్ వీక్’ను విజయవంతం చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామసభలు, ర్యాలీలు, వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఈ కోర్సు నిర్వహించబడుతుందన్నారు. 10వ తరగతి అర్హతతో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది డిప్లొమాలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన రోడ్లు కోర్టు బిల్డింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు నెలకొన్న పక్షంలో పరిష్కరించుకొని తద్వారా ముందుకు పోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.