India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉపాధ్యాయుడు, టీపీటీఎఫ్ నాయకులు పొన్నమల్ల రాములు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు విరమణ ఉంటుంది కానీ ఉపాధ్యాయ వృత్తికి విరమణ ఉండదన్నారు. రాములు ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారు. సామాజిక బాధ్యతకు కాదన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఉమ్మడి జిల్లా హాకీ పోటీల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య తెలిపారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో అండర్ 17 బాలుర హాకీ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు (45), లావణ్య (30), సహస్ర (9), శాన్వి (7)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లావణ్య తన ఇద్దరు కూతుర్లయిన సహస్ర, శాన్వితో బంధువుల ఇంటికి వెళ్తుంది. లావణ్య భర్త కుమార్ సోదరుడు ఆంజనేయులు బస్ స్టాప్ వద్ద దించేందుకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్‌లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్‌లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌హాళ్లు బుకింగ్‌లు మొదలయ్యాయి.
డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ (CBCS) నూతనంగా అడ్మిషన్ గడువు పొడిగించినట్లు సిద్దిపేట అంబేడ్కర్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఏం శ్రద్ధానందం తెలిపారు. ఈ నెల 15వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందవచ్చు అన్నారు. https://www.braouonline.in వెబ్సైట్లో అడ్మిషన్ పొందవచ్చు అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో సాత్విక్(12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి శరీరంలో పటు చోట్ల గాయాలున్నాయి. కాగా, హాస్టల్ బెడ్‌పై నుంచి పడి చనిపోయి ఉంటాడని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారు. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.
సంగారెడ్డి వీఆర్ ఉన్న ఎస్సై వినయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సైగా వినయ్ కుమార్ పనిచేస్తున్న సమయంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో సక్రమంగా విధులు నిర్వహించ లేదని వీఆర్‌కు బదిలీ చేశారు. కాగా, ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్‌చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.
డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.