India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

26న వీరనారి చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, కుల సంఘాల బాధ్యులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.

మెదక్ జిల్లాలో వానాకాలం పంటల వివరాల నమోదు ప్రక్రియ అంతమాత్రంగానే ఉంది. ఓవైపు ధాన్యం సేకరణకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు పంటల నమోదు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 3.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పలు రకాల పంటలు సాగుచేశారు. పంటల సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే డిజిటల్ క్రాప్ సర్వే అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లకు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది. ఈరోజు సాయంత్రం వరకు రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(40) అనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం నర్సాపూర్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద యూరియా సరఫరాను ఆయన పరిశీలించారు. అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి, ఖర్చులు పెరిగిపోతాయని, రాబడి తగ్గుతుందని రైతులకు వివరించారు.

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి మొత్తం 13 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీయూ టీఎస్ మెదక్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, ఆర్థిక కార్యదర్శిగా కిష్టయ్య, రాష్ట్ర కౌన్సిలర్లుగా శ్రీనివాస్, పోచయ్య, మహేందర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కుమార్ శివప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రవి, భూపతి గౌడ్, అశోక్, నర్సింలు, అరుణ్ కుమార్, రమేశ్ గౌడ్ ఎన్నికయ్యారు.

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ నగేష్ వినతులు స్వీకరించారు. అప్పాజిపల్లి గ్రామస్థులు పట్టాభూమి రోడ్డు విస్తరణలో ఇచ్చినందున పాత రోడ్డును వ్యవసాయం చేసుకోనేందుకు ప్రభుత్వ అధికారుల హామీ మేరకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డీఆర్ఓ, సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.