India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తోంది. ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, GST తగ్గింపుతో ప్రజలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయనున్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లా నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయంలో గురువారం దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కాశీ గంగా హారతి, రావణ దహన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మన బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అని, పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలన్నారు. బావి తరాలకు మనం ఇచ్చే అసలైన సంపద ఇదే అని అన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్ గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఒపీ రిజిస్టర్, పరిశీలిస్తూ వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు.
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం ఉద్యమంలో గాంధీజీ చేసిన త్యాగాలు మరువలేనివని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన గౌరవం ఇవ్వగలమన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు చూపిన శాంతి బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరూ విజయాల వైపు పయనించాలని ఆయన అన్నారు. కలెక్టర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ జగపతి
మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్టోబర్ 01 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు తెలిపారు. ఈ సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని ఆయన హెచ్చరించారు.
కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుందని డీఎస్పీ పోస్టులు సాధించిన యువకులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ కార్యాలయంలో గ్రూప్-1 డీఎస్పీలు శైలేష్, ప్రభాత్ రెడ్డి, ప్రణయ్ సాయిలను ఎస్పీ బుధవారం ఘనంగా సన్మానించారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వారిని, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
మెదక్ జిల్లాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లను పట్టుకునే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు తూప్రాన్‌లో 27, మెదక్‌లో 36 మందితో సహా మొత్తం 63 మందిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. వీరిపై 2 ఎఫ్‌ఐఆర్‌లు, 2 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు, 58 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలో జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ వృత్తికి సంబంధించిన పరికరాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, పోలీస్ శాఖ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంది. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు, తమ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను గౌరవించాలన్నారు.
మెదక్ పట్టణంలో విషాదం అలుముకుంది. పట్టణానికి చెందిన క్రికెటర్ మన జలాల్ పురం సాయి కిషోర్ (28) హఠాన్మరణం చెందాడు. ఉదయం రెండు సార్లు వరుసగా మూర్చ వ్యాధి వచ్చిందని, తర్వాత గుండెపోటు రావడంతో ఇంట్లోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయి క్రికెట్ బాగా ఆడుతాడని, సాయి మృతి చెందిన వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు క్రీడాకారులు చెప్పారు.
Sorry, no posts matched your criteria.