Medak

News April 14, 2025

మెదక్: వివాహిత మిస్సింగ్.. కేసు నమోదు

image

ఇంటి నుంచి వెళ్లిన ఒక వివాహిత కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సికింద్లాపూర్‌కి చెందిన శ్యామల శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భర్త సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

గుమ్మడిదల: భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News April 14, 2025

మెదక్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 14, 2025

మెదక్: రాజీవ్ యువ వికాస్.. నేడే చివరి తేదీ

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో చివరి తేదీ ముగుస్తున్నందున సోమవారం సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో ధ్రువ పత్రాలు సమర్పించాలని సూచించారు. సెలవు రోజులు అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొనసాగుతుందని అన్నారు.

News April 14, 2025

నేటి నుంచి అల్లాదుర్గం బేతాళస్వామి జాతర

image

అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం.

News April 13, 2025

సిద్దిపేట: బాలల అశ్లీల వీడియోలు పోస్ట్.. యువకుడి అరెస్ట్

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

News April 13, 2025

సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

image

ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్‌లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 13, 2025

గజ్వేల్: పాముకాటుతో వ్యక్తి మృతి

image

పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని శ్రీగిరి పల్లికి చెందిన పాండవుల శ్రీనివాస్(37) తన వ్యవసాయ బావి వద్ద వరి పొలంలో పనులు నిర్వహిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 12, 2025

నర్సాపూర్: కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News April 12, 2025

మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయ్..

image

మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న పాపన్నపేట, మెదక్‌లో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణం శాఖ అధికారులు వెల్లడించారు. హవేలిఘనపూర్ 40.8, టేక్మాల్ 40.6, వెల్దుర్తి 40.1, కుల్చారం 39.9, నిజాంపేట్, చేగుంట 39.7, కౌడిపల్లి 39.6, రామయంపేట్ 39.4, నర్సాపూర్ 39.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.