India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో 492 గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడు విడతల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండో విడతలో మెదక్ డివిజన్ పరిధి 10 మండలాలలో 244 గ్రామపంచాయతీలు, 2,124 వార్డులకు ఎన్నికల నిర్వహిస్తున్నారు. మూడో విడతలో తూప్రాన్ (6), నర్సాపూర్ (5) డివిజన్ పరిధి 11 మండలాలలో 248 గ్రామపంచాయతీలు, 2,096 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
జంట హత్య(తల్లి కూతుర్ల హత్య) కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన మర్రికింది నగేష్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరి వేసి హత్య చేసిన ఘటనలో కేసు నమోదు చేశారు. జిల్లా జడ్జి నీలిమ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
సిద్దిపేట కోమటి చెరువుపై నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ కలిసిపోయారు. సద్దులు తింటూ ప్రజలతో మమేకమయ్యారు. కుటుంబంతో వాటర్ బోటులో షికారు చేశారు. చెరువు కట్ట వద్ద మహిళలు ఆయనపై అభిమానం చాటుకొని సెల్ఫీలు తీశారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మూడు ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. ఫిర్యాదుల నుంచి సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు వివరించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన అల్లి విజయసేనారెడ్డి గ్రూప్-2 ఉద్యోగ ఫలితాలలో 259వ ర్యాంకు సాధించి ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. బోనాల కొండాపూర్‌కు చెందిన అల్లి విజయసేనారెడ్డి ఎమ్మెల్సీ జియోగ్రఫీ, ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం మక్కరాజుపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈరోజు విడుదలైన ఫలితాల్లో ఏఎస్ఓ ఉద్యోగం పొందారు.
మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లకు కేటాయించారు. 100% గిరిజన తండాల్లో 31 మహిళలు, 40 జనరల్, ఎస్టీల్లో 11 మహిళలు, 10 జనరల్, ఎస్సీల్లో 33 మహిళలు, 44 జనరల్, బీసీల్లో 86 మహిళలు, 93 జనరల్ కాగా అన్‌రిజర్వుడులో 66 మహిళలు, 78 జనరల్‌కు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పంచాయతీ వారీగా రిజర్వేషన్ గెజిట్ సోమవారం రానుంది. రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో జోరుగా మంతనాలు సాగుతున్నాయి.
గ్రూప్-2 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన తారక సమత సత్తా చాటారు. ఫలితాల్లో 234వ ర్యాంకు సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో) ఉద్యోగానికి ఎంపికయ్యారు. తారక జ్యోతి, మురళి దంపతుల కూతురైన సమత.. డీఎడ్, ఓపెన్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలోనే గ్రూప్-4 ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందగా ప్రస్తుతం తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. తాజాగా గ్రూప్-2 జాబ్ సాధించింది.
పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుష్మిత గ్రూప్-2 ఫలితాల్లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుష్మిత.. గ్రూప్స్ పరీక్షలో సత్తా చాటారు. భర్త శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు సుస్మిత తెలిపారు.
మెదక్ జిల్లా పరిషత్ పీఠం జనరల్(అన్ రిజర్వుడ్) రిజర్వేషన్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని 21 మండలాల జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు కాగా, ఇందులో జనరల్ కేటగిరి రిజర్వేషన్ ఉన్న ముగ్గురికి జడ్పీ పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. అందరికీ అవకాశం ఉన్నప్పటికీ ప్రధానంగా తూప్రాన్, కొల్చారం, రామాయంపేట జడ్పీటీసీ స్థానాలు ఆన్ రిజర్వుడ్ రిజర్వేషన్ ఖరారు అయ్యాయి.
మెదక్ జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని 21 స్థానాల్లో ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ-9, జనరల్-6 కేటాయించారు. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.