India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9:30 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారని తెలిపారు.
మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడితే జీవితం వృథా అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.
నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో నిందితుడు గ్యారాల శివకుమార్‌కి జీవిత ఖైదీ విధిస్తూ బుధవారం మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. 2023లో మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడనే ఆరోపణపై శివకుమార్‌పై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనలో నిన్న తుది తీర్పు వెలువడిన క్రమంలో భయభ్రాంతులకు గురై నిందితుడు పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు గ్యారాల శివకుమార్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో బ్లడ్ బ్యాంకులో నిల్వలు నిండుకున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు అత్యవసర సమయాల్లో రక్త యూనిట్ అందక అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రక్తమార్పిడికి అవసరమయ్యే రోగుల సంఖ్య పెరిగింది. కానీ ఆస్థాయిలో రక్త నిల్వలు పెరగడం లేదు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో ఒక యూనిట్ బ్లడ్ కు రూ.1,200 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంకు చెందిన సాయిరామ జగదీష్, మహేష్, సురేష్‌ను అరెస్టు చేసి నకిరేకల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించారు. దీంతో వారిని నల్గొండ జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు.
జిల్లాలో ఈ సీజన్లో పడుతున్న వానలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారాయి. జిల్లాలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి, ఇతర మెట్ట పంటలకు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలు కలిసివస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 5,57,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అనుకూలమైన వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పత్తి చేలల్లో గుంటకలు తోలుకొని కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఓ 17కు వ్యతిరేకంగా SC, ST, BC, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భోజనం అందించే కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. వారితోపాటు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా సమ్మెబాట పడుతున్నారు. నేటి నుంచి గురుకులాల్లో వంట సేవలు ఆగిపోనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 72 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులు పాల్గొన్నారు.
పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న రౌడీ షీటర్ నలపరాజు రాజేశ్ అలియాస్ ‘మెంటల్ రాజేశ్’ను నల్లగొండ పోలీసులు వైజాగ్‌లో అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా కోర్టు విచారణలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న అతడిపై జిల్లా కోర్టు నాన్-బేలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుడి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.