India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అతివేగం, అజాగ్రత్తగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు NKL జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. 2015 మార్చి18న ఖమ్మం(D) వేపకుంటకు చెందిన అంగోతు కిశోర్ కారు నడుపుతూ HYD-VJDకు బయల్దేరాడు. మార్గమధ్యలో కట్టంగూర్(M) చెరువు అన్నారం క్రాస్ రోడ్డు వద్ద బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర త్రోబాల్ సెలెక్షన్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి త్వరలో జార్ఖండ్‌లోని రాంచీ పట్టణంలో జరిగే నేషనల్ త్రో బాల్ సెలక్షన్‌లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ప్రవీణ్ కుమార్‌ను వైస్ ప్రిన్సిపల్ పరంగి రవికుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్లు అభినందించారు.
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ శివారులోని పానగల్ యూపీహెచ్‌సీని ఇవాళ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. జ్వరాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్&బీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటి మోడ్ (హ్యామ్) కింద భారీగా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులిద్దరూ దద్దమ్మలేనని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉదయసముద్రంను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కృష్ణా బేసిన్‌లోకి పుష్కలంగా నీరు వస్తుంటే చెరువులు నింపాల్సింది పోయి గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. జిల్లాలో చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014-15 నుంచి అమల్లో ఉంది. కాగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గతేడాది అక్టోబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 52 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ఇందు కోసం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు.
నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీస్ సిబ్బంది పురుషులతో సమానంగా అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఈరోజు పోలీస్ కార్యాలయంలో మహిళా సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సిబ్బంది నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడానికి ‘SHE leads – NALGONDA believes’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నల్గొండ కలెక్టరేట్‌లో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రాలను అందజేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 46 దరఖాస్తులు, ఇతర సమస్యలకు సంబంధించి 26 దరఖాస్తులు అందజేశారు. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలకు విద్యార్థులు వంద శాతం హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలోని ZPHS, ప్రాథమికోన్నత పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టీచర్స్ డైరీ, విద్యార్థుల వర్క్ బుక్, ఇతర రికార్డులను పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.