India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పుట్టా యాదగిరి గుండెపోటుతో మృతిచెందారు. పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం టీఎస్‌యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్‌గా నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.
సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ముస్తాబైంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టడమే కష్టం. ఇక జాబ్ వచ్చాక రిలాక్స్ అయి పోతుంటారు కొందరు. అలాంటిది నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామానికి నిరంజన్ రెండు ఉద్యోగాలు సాధించాడు. పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో పట్టు వదలకుండా ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టీచర్‌గా ఎంపికయ్యాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్ అనపర్తి సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్ పల్లి మండలాలలోని ఆలయాల్లో ధర్మకర్తల మండలికి 20 రోజుల్లోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో అమ్మవారిని రూ.10,65,000తో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని చండూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వాటుపల్లి బాబీ (24) కొన్ని రోజుల క్రితం తాపీ పనులు చేసేందుకు మండలంలోని ఓ గ్రామానికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఓ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.
నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.
మండలంలోని లింగాలగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన బొబ్బలి నరసింహ, గన్నేబోయిన వెంకన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన మూటలను ఇళ్లలో పడేసి వెళ్లారు. వాటిని గమనించిన సదరు వ్యక్తులు మూటలు విప్పి చూడగా అందులో పసుపు,కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, గవ్వలు, జీడిగింజలు, తాటి ఆకు బొమ్మలు బయటపడ్డాయి.
Sorry, no posts matched your criteria.