Nalgonda

News March 14, 2025

నల్గొండ: శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

News March 14, 2025

నల్గొండ: ఇంటర్ పరీక్షలు.. 601మంది డుమ్మా..!

image

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రు నాయక్ తెలిపారు. గురువారం జరిగిన ప్రథమ సంవత్సరం గణితం బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ పరీక్షలకు 13వేల 772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 13వేల 171 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 601 విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారని తెలిపారు.

News March 14, 2025

నల్గొండ: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

నల్గొండలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI

News March 13, 2025

నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

రేపు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 6గంటలకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన జాతరలో పాల్గొని పార్వతీపరమేశ్వరులకు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.

News March 13, 2025

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

image

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News March 13, 2025

నలుగురు నల్గొండకు చెందినవారే..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఐదుగురిలో విజయశాంతి తప్ప మిగతా నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.

News March 13, 2025

నల్గొండ: పోలీస్ అంటేనే ఒత్తిడితో చేసే ఉద్యోగం: కలెక్టర్

image

పోలీస్ ఉద్యోగం అంటే ఒత్తిడితో చేసే ఉద్యోగమని, శారీరక స్ఫూర్తితో పాటు అలర్ట్ కావడానికి క్రీడలు మానసికంగా ఉపయోగపడుతాయని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025కు గురువారం ఉదయం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

News March 13, 2025

నల్గొండ: మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీం నిఘా: SP

image

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై షీ టీం నిఘా ఉంటుందని.. ఈనెల 14న శుక్రవారం నిర్వహించుకునే హోలీ వేడుకల్లో ఇతరులకు హాని కలిగించొద్దని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. హోలీ పండుగను జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, కలిసి మెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 13, 2025

నల్గొండ: 15 నుంచి ఒంటిపూట బడులు..!

image

నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈనెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహిస్తామని జిల్లా డీఈవో భిక్షపతి అన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిగంట నుంచి ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు జరగనున్నాయి. SHARE IT.

News March 13, 2025

నల్గొండ: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: SP 

image

జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందస్తుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు ఫైల్ కావడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.