India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ శాఖకు టీంస్పిరిట్ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను గురువారం ఎస్పీ శరత్ చంద్ర పవర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో చేసే ఉద్యోగమని.. శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు.
హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త పథకానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం 30వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అంటున్నారు.
హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్‌లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 31 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్‌గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
ఇంటర్మీడియట్ సెకండియర్ గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు నల్గొండలో ప్రశాంతంగా ముగిశాయని DIEO దస్రూనాయక్ తెలిపారు. 13,511 మంది విద్యార్థులకు గాను 13,143 మంది హాజరయ్యారన్నారు. 368 మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
నేడు నల్గొండ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలన్నారు. డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో నేరుగా జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు.
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్‌లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
నైపుణ్య, శిక్షణ కార్యక్రమాల అమలు కోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే. శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ‘స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీ హుడ్ ప్రమోషన్’ (సంకల్ప్) కార్యక్రమంపై జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధ్వర్యంలో సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో అయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.