India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.
చింతలపాలెం మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకు యాజమాన్యంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పైపుల నుంచి నీళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించి సిబ్బందిని నిలదీయగా యాజమాన్యం బంకును మూసివేసింది. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
MGU నిర్వహించిన PHD పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి మంగళవారం తెలిపారు. ఈనెల 12న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, 18న కామర్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు, నెట్, సెట్ ఇతర అర్హత పత్రాలను తీసుకురావాలన్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి త్వరలో ప్రకటిస్తామన్నారు.
విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటుండగా ఆకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకొని ఆర్టీసీ కండక్టర్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల శివారులో జరిగింది. గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాశ్(50) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రక్తపువాంతులు చేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువ వద్ద ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపి పడేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లాలోని దామరచర్లలో మంత్రుల పర్యటనలో భాగంగా హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉ.11:00 కి మిర్యాలగూడ, దామరచర్ల, యాదాద్రి పవర్ ప్లాంట్ మంత్రుల పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ ప్లాంట్ పురోగతిపై రాష్ట్ర మంత్రులు సమీక్షించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల దగ్గర, సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 280 కోట్ల బకాయిలు, 30 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 20.83 లక్షల ఎకరాలు సాగు చేయగా.. ఇందులో 90% ప్రస్తుతం పంటలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క వరి పంటనే 10.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ,మధ్య,చిన్న తరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.
RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.
Sorry, no posts matched your criteria.