Nalgonda

News July 26, 2024

నల్గొండ: అస్సాంలో ఆర్మీ జవాన్ మృతి

image

బార్డర్‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌ అసువులు బాశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనుముల మం. మదారిగూడెనికి చెందిన ఈరేటి మహేశ్ (24). సూర్యాపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్‌-2022లో సైన్యంలో చేరారు. అస్సాంలోని మంచుకొండల్లో గస్తీ కాస్తుండగా వాతావరణ పరిస్థితుల అనుకూలించక అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కడే‌ చనిపోయారు. నేడు భౌతికకాయం స్వగ్రామానికి చేరనుంది.

News July 26, 2024

సాగర్‌కు వరద పెరుగుతోంది

image

ఉమ్మడి నల్గొండ రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. పంటల సాగు ఎక్కువగా సాగర్ ఆయకట్టు పరిధిలోనే జరుగుతోంది. కొన్ని రోజులుగా సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటేత్తుతుండగా దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News July 26, 2024

నేడు నల్లగొండలో మినీ జాబ్ మేళా

image

NLG జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు నేడు ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధికల్పన కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ నల్లగొండలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి S.మాధవరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 ప్రైవేట్ కంపెనీలు హాజరవుతున్నాయని, ఎంపిక కాబడిన వారు NLG, HYD పరిసర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.

News July 26, 2024

చెరువుగట్టుకు మహర్దశ..!

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన చెరువుగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గట్టు పైకి వచ్చే రహదారులతో పాటు ఘాట్ రోడ్డు సైతం డబుల్ రోడ్డు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News July 25, 2024

ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులన్నీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు ,వంటగది, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ,పాఠశాల ఆటస్థలం, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.

News July 25, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 25, 2024

NLG: రైతు బీమాకు ఆగస్టు 5 వరకు గడువు

image

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు వచ్చేనెల ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఏఓ పాల్వాయి శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామాల ఏఈఓలకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 25, 2024

జిల్లా వ్యాప్తంగా 109 ఖాళీలు.. భర్తీపై మళ్లీ ఆశలు!

image

గతనెలలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన 109 ఖాళీలను మళ్లీ పదోన్నతులతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పదోన్నతులపై ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఒక్కో ఉపాధ్యాయుడు రెండు నుంచి మూడేసి పోస్టుల్లో పదోన్నతి పొంది ఒక పోస్టులో జాయిన్ కావడంతో మిగతావి ఖాళీగా మిగిలిపోయాయి. కొందరు పదోన్నతి పొంది కూడా పోస్టు వద్దని రాసిచ్చారు.

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. ఉత్తమ్, కోమటిరెడ్డి నిధులు తెస్తారా!

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రులుగా ఉండడంతో జిల్లాకు ప్రయారిటీతో పాటు అధిక నిధులు వస్తాయని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.

News July 25, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తోంది..

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్వంగా వరద వస్తోంది. ప్రాజెక్టు సమాచారమిలా..
ఇన్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 503.80అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 121.3844 టీఎంసీలు