India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్ భవన్ ముందు కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు గవర్నర్‌ను కలవడానికి సిగ్గుండాలి అన్నారు. రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని మండిపడ్డారు. తెలంగాణలో పదేళ్లలో ప్రతిపక్షం లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీసీఎం వాహనం శనివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.
చిట్యాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పట్టణానికి చెందిన మహిళ సంగిశెట్టి సుగుణమ్మ (69) మృతి చెందారు. బంధువుల వివరాలిలా.. సుగుణమ్మ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. భుజం వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతోపాటు, తలకు బలమైన గాయాలయ్యాయి. కామినేని ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది.
ఉమ్మడి జిల్లాలోని 111 PACSలలో సభ్యులుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో అందరికీ రూ.లక్షలోపు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి డీసీసీబీ నుంచి అందిన సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది రుణాలే మాఫీ అయ్యాయి. ఆ జాబితా మాత్రమే డీసీసీబీకి అందినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో డిసిసిబి పరిధిలో 72,513 మంది లక్ష లోపు రుణాలు తీసుకున్నారు.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్కట్ పల్లి మండలం పల్లెపహాడ్‌లో జరిగింది. ఎస్సై అంతిరెడ్డి వివరాలిలా.. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్ మంటిపల్లి నర్శింహా బురదలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న NLG మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి గాంధీ మెడికల్ కళాశాలకు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. మెడికల్ కళాశాలలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పలువురు హెచ్వోడీలు 40 మందికి పైగా బదిలీ అయినట్లు తెలుస్తుంది.
రుణమాఫీకి సంబంధించి ఫోన్‌కు ఏమైనా లింకులు వస్తే ఓపెన్ చేయొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. రుణమాఫీ వేళ సైబర్ నేరగాళ్లు రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తారని, ఆధార్ కార్డు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రతీ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. సమవేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.