India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ సెక్షన్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అనుమతులను రద్దు చేస్తామని అన్నారు.
మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.
మునగాల పి.హెచ్. సి. ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మునగాల పి.హెచ్.సి.కి వెళ్లగా ఆ సమయానికి మెడికల్ అఫీసర్, సిబ్బంది లేకపోవటం వల్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్‌ని, మెడికల్ స్టోర్‌ని పరిశీలించారు. అలాగే పి.హెచ్.సి.ని పరిశీలించగా పరిశుభ్రంగా లేకపోవటం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చండూరుకు చెందిన వీరమళ్ళ నాగరాజు ఎలక్ట్రికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఫోన్‌కి ఉదయం ఓ లింక్ వచ్చింది. క్లిక్ చేయడంతో వెంటనే అకౌంట్ నుంచి రెండు దఫాలుగా లక్ష రూపాయలు డెబిట్ అయినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రుణమాఫీ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉపకార వేతనాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో 2023-24 సంవత్సరంలో విద్యనభ్యసించిన వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కొక్క విద్యార్ధికి రూ.50 చొప్పున కుట్టు కూలీ సొమ్ము మంజూరైంది. ఏకరూప దుస్తుల కుట్టు పనులను గ్రామైక్య సంఘాల మహిళలకు అప్పగించగా దాదాపుగా కుట్టు పనులు పూర్తి కావొచ్చాయి. BNG జిల్లాలో 40,059 మంది విద్యార్థులు ఉండగా రూ.20,02,950, NLG జిల్లాలో 74,090 మంది విద్యార్థులు ఉండగా రూ.37,04,500, SRPT జిల్లాలో 45530 విద్యార్థులకు 22,76,500 మంజూరయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉదయం నుంచి ఆ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గతంలో సదరు అధికారి రెండు సార్లు ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది. రేపు సూర్యాపేట నుంచి బదిలీ కావాల్సి ఉండగా అంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్‌పీ అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువకు విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా ఉపయోగించాలని అధికారులు కోరారు.
మిర్యాలగూడకు చెందిన ఓరుగంటి పవన్ కుమార్, రూప రేణుక దంపతుల కుమారుడు ఓరుగంటి రేయాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. రేయాన్ష్ పలు దేశాలు, జంతువులు, పక్షులు, గ్రహాల పేర్లు, జనరల్ నాలెడ్జ్, జాతీయ చిహ్నాల పేర్లను 15 నిమిషాల్లో 150కు పైగా చెప్పాడు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లభించింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రేయాన్ష్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు.
సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 25వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సోసైటి సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారలకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.