India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుణమాఫీ కింద రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 83,124 రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.454.49 కోట్లను జమ చేసింది. అటు సూర్యాపేట జిల్లాలో 56,274 మంది రైతుల ఖాతాల్లో రూ.282.98 కోట్లు, యాదాద్రి జిల్లాలో 37,285 ఖాతాల్లో రూ.203.82 కోట్లను ప్రభుత్వం జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో రానున్న నాలుగైదు రోజుల పాటూ రూ.941.29 కోట్లను జమ చేయనుంది.
NLG జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి & 2 సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ కొరకు రెండవ విడత ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ నెల 21 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా ఐటిఐల కన్వీనర్/ ప్రిన్సిపాల్ ఎ. నర్సింహ్మ చారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భూ వివాదంలో ఓ మహిళపై మాజీ ఉపసర్పంచ్ దాడిచేసిన ఘటన పెద్దవూర మండలం తేప్పలమడుగులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జానపాటి సునీతపై మాజీ ఉపసర్పంచ్ పల్లెబోయిన శంకర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో NLGలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో భూ వివాదంలో జోక్యం చేసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ భూ తగాదా విషయంలో బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు విచారణ జరిపించారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈసారైనా సాగునీరు అందుతుందా..? అని రైతులు ఎదురుచూస్తున్నారు. కృష్ణా నదికి ఎగువన ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటి విడుదల ప్రారంభమైనా.. సాగర్ ఆయా కట్టు రైతుల్లో అనుమానాలు తొలగడం లేదు. గతేడాది ఇలాగే ఆశలు ఊరించినా ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందలేదు. ఈసారి కూడా వరదలు వస్తాయా? ఆశలు నెరవేరుతాయా ..? అన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.
ఇవాళ ప్రభుత్వం రూ.లక్ష లోపు రైతుల రుణాలను మాఫీ చేయనుంది. సా.4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడిన అనంతరం నిధులను విడుదల చేయనున్నారు. నల్గొండ జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 82,999 మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. వారి వివరాలను వ్యవసాయ అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
రుణమాఫీ పొందిన రైతులతో రైతు వేదికలలో సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై బుధవారం అయిన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ, ఏపీకి తాగు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతం పరిధిలోని కుడి కాల్వకు డ్యాం అధికారులు 5,598 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 504.40 అడుగుల నీరు నిల్వ ఉంది. HYD తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలో నీటమునిగి జగదీశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. తొలి ఏకాదశి సందర్భంగా జగదీశ్ పుణ్యస్నానానికి వెళ్లినట్లు తెలుస్తుంది. మృతుడి స్వస్థలం ఘటకేసర్ మండలం కొర్రెములగా గుర్తించారు. ఇంతక ముందే సూర్యాపేట జిల్లాలో<<13645833>> ఈతకు వెళ్లి ముగ్గురు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే.
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వీరు HYD నుంచి సూర్యాపేకు పనిమీద వచ్చారు. రాజు తన కుమార్తెకు ఈత నేర్పడానికి స్నేహితుడితో కలిసి క్వారీ వద్దకు వెళ్లగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తండ్రి రాజు, అతడి స్నేహితుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.