India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేధించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పతంగులకు నైలాన్, సింథటిక్‌తో చేసిన చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరదా కోసం చేసే ఈ పని ప్రాణాల మీదకు తెస్తుందన్నారు.
ఎంజీ యూనివర్శిటీ కృష్ణవేణి వసతి గృహంలో విద్యార్థినులకు గొడ్డుకారం పెట్టిన ఘటనపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించారు. హాస్టల్స్ డైరెక్టర్ డా.దోమల రమేష్, డిప్యూటీ డైరెక్టర్ డా సాంబారు కళ్యాణి నేతృత్వంలో వార్డెన్లు రాజేశ్వరి, డా.జ్యోతి ప్రత్యక్షంగా వసతి గృహానికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థినుల భాగస్వామ్యంతో వారి నచ్చిన మెనూ ప్రకారమే నిర్వహణ జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 29,75,286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులకన్న మహిళా ఓటర్లు 48,797 మంది అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 14,63,142 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,11,939, ట్రాన్స్ జెండర్లు 2005 మంది ఉన్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాతో పోల్చితే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది.
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లా ఐదు సంవత్సరాల పదవ సెమిస్టర్ (రెగ్యులర్) & 5, 6, 7, 8, 9 సెమిస్టర్ల (బ్యాక్లాగ్) ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల లా డిగ్రీ ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వివరాలకు https://mguniversity.in/వెబ్సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
రైతుభరోసాపై KTRట్వీట్‌కు భువనగిరి MP చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరి అన్న మీరెక్కడ..? అత్యధికం ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన మేమెక్కడ..? అని మండిపడ్డారు. రాళ్లు రప్పలకు పెట్టుబడి పేరిట రూ.22 వేల కోట్లు మింగిన BRSతో మా కాంగ్రెస్‌కు పోలికా..? అని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12 వేలు, బోనస్ రూ.500 ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్..?
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. గత ఏడాది రామగిరికి చెందిన ఓ యువకుడికి మాంజా తగిలి చేతికి గాయమైన విషయం తెలిసిందే.
సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో పలు యాప్‌లు డౌన్లోడ్ చేయించి ప్రలోభ పెట్టి ప్రజల బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి సుమారు 2కోట్లను మార్కెట్లో ఇన్‌వెస్ట్‌మెంట్ చేయించి మోసం చేశారన్నారు.
గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.
ఉమ్మడి NLG జిల్లాకు చెందిన నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పై పోరాడేందుకు తొందర ఏం లేదని.. వేచి చూద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మాజీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.