Nalgonda

News June 18, 2024

ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవర్

image

నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పమన్నారు.

News June 18, 2024

NLG: భూముల విలువల పెంపుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం

image

భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. NLG, BNG, SRPTల్లో వాస్తవ ధరలకు, మార్కెట్ వెలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

News June 18, 2024

3 రోజుల వ్యవధిలో ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ

image

నల్లగొండ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలో వచ్చారు. వచ్చిన 6నెల్లలోపే బదిలీ అయ్యారు. ఈ నెల15న కలెక్టర్‌ హరిచందన బదిలీ కాగా.. తాజాగా నిన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి కూడా బదిలీ అయ్యారు. చందనాదీప్తి స్థానంలో శరత్‌ చంద్ర పవార్‌ను జిల్లా ఎస్పీగా నియమించారు. హరిచందన స్థానంలో నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు.

News June 18, 2024

నల్గొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

నల్లగొండ మండల పరిధిలోని బాబాసాయిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువకుడు తిరుమలగిరి సాగర్‌కు చెందిన బత్తుల పవన్‌గా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News June 18, 2024

చిట్యాల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సస్పెండ్

image

అడవిదేవులపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం రికార్డుల నిర్వహణ, రాగి జావ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. దీనిపై పూర్తి విచారణ జరిపి హెచ్ఎం జి.సతీష్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ భిక్షపతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారని ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు.

News June 18, 2024

నల్గొండ ఎస్పీగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు

image

యాంటి నార్కోటిక్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌చంద్ర పవార్‌‌ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్‌ జోన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌ సింగ్‌ను నియమించింది.

News June 18, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News June 17, 2024

నల్గొండ, సూర్యాపేటకి కొత్త పోలీస్ బాస్‌లు

image

నల్గొండ జిల్లా ఎస్పీగా శరత్‌చంద్ర పవార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చందనదీప్తీ బదిలీపై సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వెళ్లనున్నారు. అటూ సూర్యాపేట ఎస్పీగా సన్ ప్రీత్‌సింగ్ బదిలీపై రానున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాహుల్ హెగ్డే HYD ట్రాఫిక్ డీసీపీగా బదిలీపై వెళ్లనున్నారు.

News June 17, 2024

నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా అరెస్టు

image

నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

News June 17, 2024

సూర్యాపేట- ఖమ్మం హైవేపై ధర్నా 

image

సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో తుమ్మలపల్లి గ్రామస్థులు దర్నా చేపట్టారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం- సూర్యాపేట హైవేపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.