Nalgonda

News December 26, 2024

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ ఉదయం 5గం.లకు అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మృతి పట్ల టీఎస్ యుటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, అనీల్, జిల్లాలోని మండల శాఖల పక్షాన సంతాపం ప్రకటించారు. 

News December 26, 2024

NLG: మళ్లీ పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం

image

NLG జిల్లాలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా మర్రిగూడ మండలంలో నిర్వహిస్తున్న సర్వేలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ మండలంలో 20 గ్రామపంచాయతీలో 39,700 మందిపై సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు 880 కుటుంబాలు 4 వేలకు పైగా ప్రజలపై ఈ ఫ్లోరోసిస్ సర్వేను వైద్య సిబ్బంది పూర్తి చేశారు. శివన్నగూడ, బట్లపల్లి గ్రామాల్లో అధికంగా ఫ్లోరైడ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News December 26, 2024

NLG: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

image

జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1770 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 856, సూర్యాపేట జిల్లాలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ జీపీలు ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.

News December 26, 2024

NLG: రామానందలో ఉచిత శిక్షణ

image

భూదాన్ పోచంపల్లి మండలంలోని SRTRIలో వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ PSSR లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ, భోజన వసతితో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జనవరి 2 లోపు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 25, 2024

NLG: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

NLG: ఎవరు ‘నామినేట్’ అవుతారు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు తహతహలాడుతున్నారు. పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌ల పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. కాగా జిల్లాస్థాయి హోదాలైన గ్రంథాలయ సంస్థ, వైడీటీఏ, పలు కార్పొరేషన్ల పదవులు ఆశిస్తున్నారు. దీనికోసం అగ్ర నేతలను తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేశామని, తమకే పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.

News December 25, 2024

భువనగిరి: అంగన్‌వాడీ టీచర్ల సస్పెండ్ 

image

చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో BNGR కలెక్టర్ హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్‌ 7వ కేంద్రం అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. 

News December 25, 2024

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

News December 24, 2024

NLG: గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ

image

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.

News December 24, 2024

NLG: సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు!

image

పేదల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురానుంది. సంక్రాంతికి కొత్తగా తెల్ల రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మందికిపైగా కొత్త రేషన్ కార్డులతో పాటు తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.