Nizamabad

News August 14, 2025

NZB: జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, ఉదయం సగటున 23మి.మీ వర్షపాతం నమోదైందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మంత్రులు, సీఎస్‌తో వీసీలో మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు.

News August 14, 2025

SRSP UPDATE: 45.758 TMCలకు చేరిన నీటిమట్టం

image

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం 45.758 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 13,910 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,713 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 14, 2025

NZB: నేటితో ముగియనున్న సహకార సంఘాల పాలకవర్గం

image

రైతుల ఆర్థిక బలపాటుకు వెన్నుదన్నుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 89 సహకార సంఘాల పాలకవర్గాల గడువు పూర్తయ్యింది. 89 ఛైర్మన్లు, 1,157 డైరెక్టర్లు ఉన్న ఈ సంఘాలకు కొత్తగా ఎన్నికలపై రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు.

News August 14, 2025

NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

image

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News August 14, 2025

NZB: ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్

image

నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ప్రతి రోజూ ఆకస్మిక తనిఖీలతో హడలేత్తిస్తున్నారు. ఏదో ఒక మండలాన్ని, ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలను గోప్యంగా ఉంచడంతో డుమ్మాలు కొట్టే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో కలెక్టర్ ఏ కార్యాలయానికి తనిఖీలకు వస్తారో తెలియక ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News August 14, 2025

NZB: ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు రాష్ట్రానికి ముప్పు: జీవన్ రెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ట్రానికి ముప్పుగా పరిణమిస్తోందని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన NZBలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని మండిపడ్డారు.

News August 14, 2025

NZB: ఈ నెల 17న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

image

నిజామాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న జిల్లా స్థాయి బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కిరణ్ కుమార్ తెలిపారు. మోపాల్‌లోని ఫిట్నెస్ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు అండర్ 15, 13, 11 విభాగాల్లో ఎంపికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనేవారు 98483 51255కు ఫోన్ చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీని సంప్రదించాలన్నారు.

News August 14, 2025

NZB: MDM కుకింగ్ కాస్ట్‌, గౌరవ వేతనాలకు నిధుల విడుదల: DEO

image

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం (MDM)కు సంబంధించి పెండింగ్, రెగ్యులర్ బిల్లుల కోసం నిధులు విడుదల చేసినట్లు DEO అశోక్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతుల కుకింగ్ కాస్ట్‌కు రూ.89,00, 445 CCHల గౌరవ వేతనం రూ.1,000 చొప్పున రూ.23.98 వేలు జులై వరకు మంజూరైనట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మండలాల వారీగా MEO SNA అకౌంట్లకు జమ చేసినట్లు DEO వెల్లడించారు.

News August 14, 2025

NZB: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ ఛైర్మన్

image

నిజామాబాద్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

News August 13, 2025

SRSPకి 12,769 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో

image

అల్పపీడన ద్రోణితో వర్షాలు కురుస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగడం లేదు. బుధవారం మధ్యాహ్నం 12,769 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి రాగా సాయంత్రం 6.30 గంటలకు కూడా అంతే మొత్తంలో నీరు ఎగువ నుంచి వస్తోంది. దిగువకు 4,163 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,080 అడుగులు(45.161TMC)లకు నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.