India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారినిTPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్న రాత్రి మహేష్ కుమార్ గౌడ్ మోపిదేవిలోని సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు.
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అంటారు పెద్దలు. కానీ అవయవదానం ద్వారా మరణించిన తరవాతా జీవించే అవకాశం లభిస్తుంది. NZB జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. NZB కోర్టులో టైపిస్టుగా పనిచేసిన అందె సుధారాణి (52) 2022 ప్రమాదవశాత్తు గాయపడి బ్రెయిన్ డెడ్ కాగా ఆమె కిడ్నీ, లివర్, లంగ్స్, కళ్లను కుటుంబ సభ్యులు జీవదాన్ ట్రస్టుకు అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన(MDM) పథకం భారంగా మారుతోంది. NZB జిల్లాలో 1,122 MDM ఏజెన్సీల్లో 2,350 మంది కార్మికులు పని చేస్తుండగా వీరికి గత అక్టోబర్ నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి (40%వాటా) సుమారు రూ. 3.50 కోట్ల వరకు బకాయి రావాల్సి ఉందంటున్నారు. పైగా కొత్త మెనూ అమలుతో పెరిగిన ఖర్చులు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
నిజామాబాద్లోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఈ నెల 14న (గురువారం) యువతులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ యాదగిరి తెలిపారు. ఐటీసీ మనోహరాబాద్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాకు 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగి, ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసిన యువతులు అర్హులు. ఎంపికైన వారికి మంచి వేతనాలు ఉంటాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9441707536 నెంబర్ను సంప్రదించవచ్చు.
నిజామాబాద్ జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
SRSP ప్రాజెక్ట్ కింద ఉన్న లిఫ్ట్లు ఆన్ చేసి జిల్లాలో అన్ని చెరువులు నింపాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం 1,086 చెరువులు ఉంటే 377 చెరువులు 25 శాతం, 424 చెరువులు 50 శాతం, 204 చెరువులు 75 శాతమే నిండాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 292 చెరువుల్లో ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదన్నారు. జిల్లాలోని అన్ని చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసే చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.937 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు 18,456 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని, ఔట్ ఫ్లో 7,234 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులో 1080 అడుగులకు నీరు చేరుకుందని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో CP సాయి చైతన్య ప్రజల నుంచి 22 ఫిర్యాదులను స్వీకరించారు. వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లు SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.