India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలన్నారు. జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావటంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరికొంత మంది కింది స్థాయి అధికారులను పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ మండిపడ్డారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం 10.30 నుంచి 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బయోమెట్రిక్ అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 13న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి “మార్కింగ్ మహా మేళా” నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 17,301 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 9,486 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. మంజూరీ పొందిన లబ్ధిదారులు ఈ నెల 13న తమ స్థలాలను మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అర్హులైన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన దరఖాస్తుదారులకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
కుటుంబ పోషణ చూసుకునే వ్యక్తి (వయస్సు 18-60 సంవత్సరాల మధ్య) మరణించినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైనవారు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
NZB ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ ITIలలో ప్రత్యక్ష ప్రవేశాలు (వాక్-ఇన్) నిర్వహిస్తున్నట్లు ITI కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి తెలిపారు. ఈనెల 28 వరకు ఈ ప్రవేశాలు ఉంటాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనివారు కూడా అదే రోజు దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని అడ్మిషన్ పొందవచ్చని ఆయన చెప్పారు. 1,2 దశ అడ్మిషన్లలో సీట్లు పొంది ఇంకా రిపోర్ట్ చేయనివారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకటరెడ్డి శనివారం తెలిపారు. NZB జిల్లాకు చెందిన చాకలి రాజు (21), వూదరి నగేష్, KMRజిల్లాకు చెందిన కర్నె లింగం (34) కలిసి ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో రాజు, లింగంను అరెస్ట్ చేసి రూ 7.50 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించినా స్పందన లేకపోవడంతో చందాలు జమచేసుకుని రోడ్డును బాగుచేసుకున్నారు మహాలక్ష్మి కాలనీలోని సాయిటవర్స్ వాసులు. కొంత కాలంగా అక్కడి రోడ్డు గుంతల మయంగా మారింది. ఆ రోడ్డు వెంట వెళ్లి పలువురు గుంతల్లో పడి గాయపడ్డారు. గుంతల్లో నీళ్లు చేరి పిల్ల కాలువలను తలపించగా అధికారుల స్పందన లేకపోవడంతో చందాలు వేసుకుని ఆదివారం రోడ్డును బాగుచేయించుకున్నామని తెలిపారు.
హనుమకొండ, జనగాం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు సత్తా చాటి మొత్తం 14 పతకాలు సాధించారని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్, రాజాగౌడ్ తెలిపారు. వివిధ పోటీల్లో బస్సి జైపాల్, మోతి లాల్, డి.సత్య, నవీన్ బంగారు పతకాలు సాధించారన్నారు. ఎం.శివరాజ్, పి.జేషన్, ఏ.ప్రణయ్, ఎం.గాయత్రి, జి.అజయ్, భూక్య అర్జున్, అబ్దుల్ గఫార్, షేక్ సోయల్ కాంస్య పతకాలు సాధించారన్నారు.
నవీపేట్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గారావు ఫారం వద్ద లారీ – బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్‌కు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మహేష్ కుమార్ గౌడ్‌కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.