Nizamabad

News August 31, 2024

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ టూ టౌన్ ఎస్సై యాసిర్ ఆరాఫత్ తెలిపారు. హైమద్ పుర కాలనీకి చెందిన ఓ పదేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కిరాణా షాపునకు వెళ్లి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన భాసిత్ (50) అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News August 31, 2024

రుద్రూర్: బాత్రూంలో పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్

image

రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్‌లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టగా ఉరివేసుకొని కనిపించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సైలు సాయన్న, కృష్ణకుమార్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

News August 31, 2024

నిజామాబాద్: గోదావరిలో దూకేందుకు వివాహిత యత్నం

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోంకన్ పల్లికి చెందిన ఓ వివాహిత(27) బాసర గోదావరి నదిలో దూకడానికి యత్నించింది. అక్కడే ఉన్న గంగపుత్రులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్ఐ లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్ వినాయక్, బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ఆమెను ఠాణాకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 31, 2024

నిజామాబాద్ జిల్లాలో FM స్టేషన్లు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.

News August 31, 2024

NZB: రాష్ట్రంలోనే GGHలో అత్యధిక OP నమోదు

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH)లో అత్యధిక OP నమోదయింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 28న 2,680 మంది రోగులు GGHకి వచ్చారు. హైదరాబాద్ ఉస్మానియాలో 2,566 మంది, గాంధీలో 2,192 మంది, వరంగల్ MGMలో 2,385 మంది OPగా నమోదు చేసుకున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలోనే OP తాకిడి పెరిగినట్లు అధికారుల అంచనా.

News August 31, 2024

అవని లేఖరాకు NZB ఎంపీ అభినందనలు

image

పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన భారత స్టార్ పార షూటర్ అవని లేఖరాకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా.. ఆమె బంగారం పతకంతో ఉన్న ఫోటోను జత చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్  పార ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 3 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు.

News August 30, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* బోధన్: లాడ్జిలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి
* NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
* అంతరాష్ట్ర లెండి ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృఢ సంకల్పంతో ఉన్నాం: జుక్కల్ MLA
* బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి బాధ్యతల స్వీకరణ
* నసురుల్లాబాద్: ఆటో, బొలెరో ఢీ.. ఒకరు మృతి
* కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
* బాన్సువాడ: అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

News August 30, 2024

బోధన్: లాడ్జీలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి

image

బోధన్ బస్ స్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఒక యువతితో బీఆర్ఎస్‌కి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్‌ను శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. దీనితో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ కౌన్సిలర్‌కు దేహశుద్ధి చేసి కౌన్సిలర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ నెల 7న బోధన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మంగల్ పాడ్ వద్ద మైనర్‌తో పట్టుబడగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News August 30, 2024

NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

image

డిచ్పల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండల కేంద్రంలోని సాయినగర్ లో నివాసం ఉంటున్న CRPF రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 30, 2024

TUలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్లేస్‌మెంట్ డ్రైవ్’

image

తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ కంపెనీవారు విభాగాధిపతి డాక్టర్ ఏ నాగరాజు పర్యవేక్షణలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పలువురు విద్యార్థులు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం యాదగిరి ప్రిన్సిపాల్, విభాగపు అధ్యాపకులు పాల్గొన్నారు.