India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.
2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.
ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పోతంగల్ మండలం కల్లూరుగ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.
నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.
సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!
Sorry, no posts matched your criteria.