Nizamabad

News February 1, 2025

NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు

image

ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.

News February 1, 2025

రుద్రూర్: బట్టలు ఉతకడానికి వెళ్లి యువకుడి దుర్మరణం

image

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ చెరువులో శుక్రవారం రాత్రి JNC కాలనీకి చెందిన సాజన్(36) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. గురువారం సాయంత్రం బట్టలు ఉతకాడానికి బైక్ పై వెళ్లిన సాజన్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా చెరువులో మృతదేహం లభించింది. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు

News February 1, 2025

మెండోరా: బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

image

మెండోరాలో 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న SBI బ్యాంకులో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నెహ్రునగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి బ్యాంక్ షటర్ తాళాలు పగలగొట్టి షటర్ తీసే ప్రయత్నం చేశాడు. షటర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు ఉదయం బ్యాంకు మేనేజర్ వచ్చి సీసీ కెమెరాలు చూడటంతో దొంగతనానికి పాల్పడినట్లు గమనించి మెండోరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.

News February 1, 2025

NZB: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంలో రికార్డు

image

ఆదిత్య హృదయ స్తోత్రం చదవడంలో నిజామాబాద్‌కు చెందిన సహాన్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు తెలుగు వెలుగు సమాఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. 31 శ్లోకాలు గల ఆదిత్య హృదయ స్తోత్రమును 2వ తరగతి చదువుతున్న సహాన్ కేవలం 3 నిమిషాలు 24 సెకన్లలో స్వర యుక్తంగా చదివి జాతీయ స్థాయి రికార్డు సాధించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 3న రైల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో ఆశీర్వద సభ ఉంటుందన్నారు.

News February 1, 2025

NZB: రూల్స్ పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నియంత్రించవచ్చని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా ప్రచారాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News January 31, 2025

NZB: కాల్ లెటర్లు అందజేసిన టాస్క్ సీఈవో

image

నిజామాబాద్ నగరంలోని ఐటీ హబ్‌లో ఉద్యోగాలు సాధించిన 30 మందికి టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా శుక్రవారం కాల్ లెటర్లు అందజేశారు. అనంతరం సీఈఓ సిన్హా మాట్లాడుతూ.. నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ స్థాపించడం శుభపరిణామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో నడిచేది ఏఐ రంగమేనన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు యువతలో ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయన్నారు.

News January 31, 2025

NZB: నీళ్ల విషయంలో ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుంది: కవిత

image

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News January 31, 2025

డిచ్‌పల్లి: పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ పరీక్ష కేంద్రాన్ని ఉపకులపతి యాదగిరి రావు, రిజిస్ర్టార్ యాదగిరి శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలలో కళాశాల ప్రధానాచార్యులు ఆరతి, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అడిషనల్ కంట్రోలర్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

News January 31, 2025

NZB: డిచ్పల్లి పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

image

డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. సుద్ధపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. కూరగాయలు భద్రపర్చకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు.

News January 31, 2025

NZB: పసుపుబోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పల్లె గంగారెడ్డి

image

జాతీయ పసుపుబోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సమక్షంలో ఆయన తొలి సంతకం చేయగా ఎంపీ ఆయనను అభినందించారు. పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు రైతుల సంక్షేమం కోసం పాటు పడతానని పేర్కొన్నారు.

error: Content is protected !!