India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రూప్-3 ఫలితాల్లో NZB <<15733792>>డిచ్పల్లి 7వ బెటాలియన్ రిజర్వుడ్ SI ఓరంగంటి అశోక్ మరోసారి స్టేట్ 14వ ర్యాంకు <<>>సాధించారు. SI స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామం. ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 320 మార్కులు సాధించి BC(A)తో పాటు, భద్రాద్రి జోన్ టాపర్‌గా నిలిచారు. అలాగే గ్రూప్-2లో సైతం స్టేట్ 57 ర్యాంక్, BC(A)లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. గ్రూప్- 2,3లో సత్తా చాటిన SI పై మీ కామెంట్?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎండలు తారస్థాయికి చేరాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీరు కోసం ప్రజలు రంజన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లలో అదిలాబాద్, నిర్మల్, రాజస్తాన్ తదితర ప్రాంతాల రంజన్లను బట్టి రూ. 100 – 450 విక్రయిస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన రంజన్ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్‌పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ADB నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్‌కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ADB-ARMR రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రైల్వేలైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు తెస్తామంటున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా కాంతులు వెదజల్లుతూ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో అందరిని ఈ దృశ్యం ఆకట్టుకుంది. సూర్యుడు లాగా చంద్రుడు వెలగడం అనేది మొదటిసారిగా చూస్తున్నామని మోపాల్ గ్రామస్థులు తెలిపారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.
నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు.
నిజామాబాద్ నగరంలోని NGOs కాలనీలో గంజాయి అమ్ముతున్న కోడె సంపంత్ (24)ను నిన్న రాత్రి త్రీ టౌన్ ఎస్సై హరిబాబు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడి చేసి నిందితుడిని పట్టుకుని అతడి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
Sorry, no posts matched your criteria.