India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.
రాష్ట్ర బడ్జెట్ నిజామాబాద్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ఊసేలేదు. కాగా శ్రీరాంసాగర్ మెుదటి దశ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. కాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా వనపర్తి జిల్లాలో జరిగిన అండర్ 14 బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్ జట్లు తలపడ్డాయి. ఇందులో జిల్లా జట్టు 2-0 గోల్ తేడాతో విజయం సాధించింది.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో బుధవారంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 743 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లాలో మొత్తం 19,349 మంది విద్యార్థులకు 18,606 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినట్లు రవి కుమార్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బుధవారం ఉదయం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మరి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉండనుందో.?
చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.
Sorry, no posts matched your criteria.