India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా కాంతులు వెదజల్లుతూ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో అందరిని ఈ దృశ్యం ఆకట్టుకుంది. సూర్యుడు లాగా చంద్రుడు వెలగడం అనేది మొదటిసారిగా చూస్తున్నామని మోపాల్ గ్రామస్థులు తెలిపారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.
నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు.
నిజామాబాద్ నగరంలోని NGOs కాలనీలో గంజాయి అమ్ముతున్న కోడె సంపంత్ (24)ను నిన్న రాత్రి త్రీ టౌన్ ఎస్సై హరిబాబు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడి చేసి నిందితుడిని పట్టుకుని అతడి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్కు వచ్చిన చిన్నారి స్టేషన్లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన దొంద రామ్ కిషోర్ గ్రూప్-3 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. 317 మార్కులతో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంక్ సాధించారు. ఇటీవల ఆయన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిజామాబాద్లో కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టులు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.