India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని శ్రీనిధి (14) గుండెపోటుతో మృతి చెందింది. ఇవాళ పాఠశాలకు బయలుదేరిన శ్రీనిధి కామారెడ్డిలో ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ నెల 20 నుంచి 24 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు సిరికొండ మండలం చిమ్మన్ పల్లికి చెందిన వినోద్ నాయక్ జిల్లా జట్టుకు కోచ్‌గా నియమతులయ్యారు. వినోద్ నాయక్ కాకతీయ యమున క్యాంపస్‌లో కబడ్డి కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుకు కోచ్ గా ఎంపిక కావడం పట్ల డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ ను TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దళితబంధు నిధులను బడ్జెట్ లోపు విడుదల చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు.
ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభమైనందున క్రయవిక్రయాలను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు.
తెలంగాణలో ఇక BRS అధికారంలోకి రావడం కలనే అని, రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. BRS, BJP నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష లీడర్ హోదాను KCR.. KTR, హరీశ్‌రావ్‌కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
బీసీలపై ప్రేమతోనే కులగణన చేపట్టామని TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. BRS, BJP ఒక్కటే అని, అవి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది BJP ఎంపీలు ఉంటే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో పొలాల్లో గురువారం ఉదయం కరెంట్ షాక్‌తో <<15520125>>ముగ్గురు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్సు గంగారాం(45), బాలమణి (40) వారి కొడుకు కిషన్(22) ఉదయం పంట పొలంలో వరికి నీరు పెట్టేందుకు వెళ్లగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మృతిచెందినట్లు భావిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 61,412 మంది, 15 ఏళ్ల వయస్సు ఉన్న 40,275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్‌లో ఉందని ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేసేలా యంత్రాంగం చొరవ చూపాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోయారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చోరీ చేస్తుండగా వారికి షాక్ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.