India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవీగా దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్‌లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నాలుగు క్వింటాళ్ల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చించి 15 రకాల పండ్లు కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు చేపడున్నామన్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన <<14277266>>ముగ్గురు <<>>సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కొన్ని నెలల క్రితం ఇంటి పనులు ప్రారంభించారు. అప్పులు, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన NZBలో మీడియాతో చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్‌గా హైదరాబాద్ పరిస్థితి మారకూడదంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు.
రుణ మాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాపులో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.