Nizamabad

News June 30, 2024

ఆర్మూర్‌: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఒకరు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతుడు జిరాయత్ నగర్ కాలనీకి చెందిన రవిగా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News June 30, 2024

ధర్మపురి శ్రీనివాస్‌ మృతిపై మోదీ దిగ్భ్రాంతి

image

ధర్మపురి శ్రీనివాస్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన మృతిపై ప్రధాని మోదీ ‘X’లో సంతాపం వ్యక్తం చేశారు. ‘పేదల సాధికారత కోసం శ్రీనివాస్ పని చేశారు. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. DS మృతికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. DSకు మాజీ ఉప రాష్ట్రపతి , కేంద్రమంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించిన విషయం తెలిసిందే.

News June 30, 2024

కామారెడ్డి: కన్నకొడుకును కడతేర్చిన తండ్రి

image

మద్యం మత్తులో తండ్రి కొడుకుని కడతేర్చిన ఘటన కామారెడ్డి(D) ఎల్లారెడ్డి(M)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గండి మాసానిపేట్‌కు చెందిన వెంకటేశంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సాయిలు(40) మద్యానికి బానిసై ఆస్తి కోసం తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో విసుగు చెందిన వెంకటేశం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు‌ను కర్రతో బాది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి సమీపంలోని కాలువలో పడేసినట్లు తెలిపారు.

News June 30, 2024

నేడు నిజామాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ధర్మపురి శ్రీనివాస్ అంతక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతక్రియలకు సీఎంతో పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 30, 2024

టీమిండియా గెలుపు.. అంబరాన్నంటిన సంబరాలు

image

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. బిక్నూరులో అర్ధరాత్రి యువకులు ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించి స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేత బూని యువకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిట్లంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్రికెట్ అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

News June 29, 2024

నిజామాబాద్‌లో DS పార్థివ దేహం సందర్శనార్థం..

image

కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్థివ దేహాన్ని HYD నుంచి శనివారం సాయంత్రం NZB‌లోని ప్రగతి నగర్‌లో ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. DS పార్థివ దేహాన్ని చూసి కొందరు కంటతడి పెట్టారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివిధ కుల సంఘాల నాయకులు DS భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

News June 29, 2024

NZB: సిమెంట్ పైపే ఆమెకు ఆశ్రయం.!

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం (కె) మూల మలుపు వద్ద రెండు పాడైన సిమెంట్ పైపులు (గూణలు) ఉన్నాయి. వాటిని ఇల్లుగా మార్చుకొని ఓ వృద్ధురాలు జీవిస్తోంది. భర్త చనిపోయారని, నా అనే వారు ఎవరు లేరని, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొంది. దాతలు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News June 29, 2024

కామారెడ్డి: ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడగింపు

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఇంటర్ విద్యాశాఖ పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. వచ్చే నెల 31 వరకు 2వ విడత అడ్మిషన్ కొనసాగుతుందని చెప్పారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సంబంధిత కళాశాలలకు వెళ్లి వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని తెలిపారు.

News June 29, 2024

సోనియా గాంధీకి విధేయునిగా డి.శ్రీనివాస్

image

కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన డి. శ్రీనివాస్‌కు ప్రణబ్ ముఖర్జీ, జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలతో సన్నిహత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. కాగా ఆయన 2013 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

News June 29, 2024

వేల్పూర్‌లో పుట్టి రాజకీయాల్లో చక్రం తిప్పిన D. శ్రీనివాస్

image

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 1948 సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ NSUI కార్యకర్తగా చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. RBIలో ఉద్యోగం చేస్తుండగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. దివంగత నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చక్రం తిప్పారు.